ఘర్షణ మూవీ విలన్ ఇప్పుడు ఎక్కడున్నాడో.. ఏం చేస్తున్నాడో తెలుసా..??

వెంకటేష్, ఆసిన్( Venkatesh, Asin ) హీరో హీరోయిన్లుగా వచ్చిన ఘర్షణ( Garshana ) (2004) సినిమా గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.

ఇందులో వెంకటేష్ చాలా బాగా నటించాడు.

ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో పాటలు కూడా చాలా బాగుంటాయి.సినిమా ఎందుకు ఫెయిల్ అయిందో తెలియదు కానీ టీవీలో వస్తే దీన్ని ప్రేక్షకులు తప్పకుండా చూస్తారు.

గౌతమ్ వాసుదేవ్ మీనన్ ( Gautham Vasudev Menon )డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2003 తమిళ బ్లాక్ బస్టర్ "కాఖా కాఖా"కి రీమేక్ కాగా ఒరిజినల్ సినిమాకి సంగీతం అందించిన హారిస్ జయరాజే తెలుగు రీమేక్‌కి కూడా మ్యూజిక్ అందించాడు.ఈ సినిమాలో వెంకటేష్, ఆసిన్ తర్వాత బాగా హైలైట్ అయింది విలన్ సలీమ్‌ బేగ్ అని చెప్పుకోవచ్చు.

Gharshana Movie Villain Details , Gharshana Movie, Venkatesh, Asin , Gautham Vas

పండాగా ఈ నటుడు అద్భుతంగా నటించాడు.పండా ఇందులో చాలా పెద్ద క్రిమినల్.అతడు తన శత్రువుల కుటుంబంలో ఒకరిని చంపి ఆ శత్రువులు బాగా బాధపడేలాగా చేస్తుంటాడు.

Advertisement
Gharshana Movie Villain Details , Gharshana Movie, Venkatesh, Asin , Gautham Vas

ఆ క్యారెక్టర్ లో సలీమ్‌ ( Saleem )పరకాయ ప్రవేశం చేశాడు.అతడి యాక్టింగ్ చూస్తుంటే మనకి భయమేస్తుంది.అంత బాగా నటించాడు.

అందుకే ఈ సినిమా తర్వాత ఈ విలన్ కు ఆంధ్రుడు, డాన్, ఒక్కమగాడు, కాస్కో, గోలీమార్, లెజెండ్, వినయ విధేయ రామ వంటి తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది.వీటన్నిటిలో కూడా ఈ నటుడు చాలా బాగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు.

ఒక విలన్ అంటే ఎలా ఉండాలో సలీమ్‌ను చూసి నేర్చుకోవచ్చు.

Gharshana Movie Villain Details , Gharshana Movie, Venkatesh, Asin , Gautham Vas

2021లో వచ్చిన "ఆరడుగుల బుల్లెట్" సినిమాలో కూడా నటించాడు.అదే ఇతనికి చివరి సినిమా.గౌతమ్ ఇతడి యాక్టింగ్ స్కిల్స్ చూసి ఫిదా అయిపోయాడు అందుకే తన ధ్రువ ,నక్షత్రం( Dhruva, Nakshatram ) సినిమాలో మరోసారి ఛాన్స్ ఇచ్చాడు.

భారతీయుల పొదుపు మంత్రం – ప్రపంచానికే మార్గదర్శకం
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

అయితే ధ్రువ నక్షత్రం సినిమా కొన్ని లీగల్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తుంది కాబట్టి ఇది ఇంతవరకు రిలీజ్ కాలేదు.ఇది 2020లోనే రిలీజ్ అవాల్సి ఉంది.

Advertisement

2021 తర్వాత సలీమ్‌ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.నెగిటివ్ రోల్స్ లో బీభత్సం సృష్టించిన ఈ స్టార్ ఇప్పుడు రియల్ లైఫ్ లో చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.పర్ఫెక్ట్ విలన్ బాడీ ఉండి కూడా సినిమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నాడో తెలియ రాలేదు.

టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం ఏదో ఒక సినిమా ద్వారా కం బ్యాక్ ఇవ్వాలంటూ అతడి సోషల్ మీడియా పోస్టుల కింద కామెంట్లు చేస్తున్నారు.మరి ఈ పాన్ ఇండియా, వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తున్న వేళ అతడు ఒక మంచి యాక్షన్ సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి.

తాజా వార్తలు