జీవితం ఇలా బాగుంది అంటున్న జెనిలియా

హ హా హాసిని అంటూ ప్రతి తెలుగింటిని మురిపించింది అందాల జెనిలియా.

చిన్నపిల్లల అనిపించే ఆహార్యం, దానికి తగ్గట్టుగా చలాకితనం, ఇంటిల్లపాదీ అభిమానించే కథానాయికగా అలరించిన ఈ అందం బాలివుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ని మనువాడిన విషయం తెలిసిందే.

ఒక హీరోయిన్, ఒక ప్రేయసి, ఒక భార్య, ఇప్పుడు ఒక తల్లి.వీటన్నిటిలో మీరు ఎక్కువ ఆస్వాదించిన బాధ్యత ఏది అని అడగగా " హీరోయిన్ గా పేరు సంపాదించినా, ఆ పేరు కాపడటం కోసం నచ్చని సినిమాలు కూడా చేయాల్సివచ్చింది.

Genelia Loving This Phase Of Life-Genelia Loving This Phase Of Life--Telugu Toll

కాని కొన్ని మంచి పాత్రలు చేసాన్నన్న సంతృప్తి ఉంది.ఒక ప్రేయసిగా, భార్యగా నాపై ఎలాంటి భాధ్యతలు లేవు.

అన్ని రితేష్ చుసుకుంటాడు.నేను అడగకముందే అన్ని చేసిపెడతాడు.

Advertisement

బాబు పుట్టాకే నాకు బాధ్యత అంటే ఎంటో తెలిసివచ్చింది.వాడితో ఆడుకొవడం, మాటలు నేర్పించడం, ఇవన్ని ఎంత ఆనందాన్ని ఇస్తున్నాయో మాటల్లో చెప్పలేను.

జీవతం ఒకప్పటికన్నా ఇప్పుడే బాగుంది, ఇలానే బాగుంది" అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది జెనిలియా.

Advertisement

తాజా వార్తలు