రాధిక రేంజ్ పెంచేలా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి..!

యువ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య డైరెక్షన్ లో వస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ( Gangs of Godavari ).

ఈ సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చున్ ఫోర్ మూవీస్ కలిసి నిర్మిస్తున్నారు.

రౌడీ ఫెలో, చల్ మోహన్ రంగా సినిమాల తర్వాత కృష్ణ చైతన్య చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేస్తున్నారు.ఈ సినిమా పీరియాడికల్ మూవీగా రాజమండ్రి నేపథ్యంతో తెరకెక్కుతుందని తెలుస్తుంది.

Gangs Of Godhavari Radhika Alias Neha Shetty Will Going Craze, Vishwak Sen, Gang

ఈ సినిమా లో నేహా శెట్టి( Neha Shetty ) హీరోయిన్ గా నటిస్తుంది.సినిమాలో నేహా శెట్టి లుక్స్ చాలా బాగున్నాయి.

డీజే టిల్లు లో హీరోయినే అయినా ఫ్రాడ్ ఉమెన్ గా కనిపించిన నేహా శెట్టి ఆ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.ప్రస్తుతం కార్తికేయ తో బెదురులంక 2012 సినిమాలో నటించిన ఆమె గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లో సరికొత్తగా కనిపిస్తుంది.

Advertisement

డీజే టిల్లు రాధిక ఇమేజ్ ని బ్రేక్ చేసి నేహా శెట్టికి ఈ సినిమాతో సరికొత్త క్రేజ్ ఏర్పడేలా ఉందని చెప్పొచ్చు.విశ్వక్ సేన్ ( Vishwak Sen )మాస్ లుక్ సినిమాపై అంచనాలు పెంచింది.

ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు