చిరు కొడుకు సినిమాకు పోటీగా నాగ్ కొడుకు.. సంక్రాంతి రేసులో ఊహించని ట్విస్ట్!

సంక్రాంతి పండుగ రేసు విషయంలో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.

గేమ్ ఛేంజర్, బాలయ్య బాబీ కాంబో (game changer, Balayya Bobby Combo) మూవీ సంక్రాంతి రేసులో ఉన్నాయనే సంగతి తెలిసిందే.

వెంకటేశ్ అనిల్ రావిపూడి (Venkatesh ,Anil Ravipudi)కాంబో మూవీ షూట్ దాదాపుగా పూర్తి కాగా ఈ సినిమా సంక్రాంతి రేసులో కచ్చితంగా నిలుస్తుందో లేదో చెప్పే పరిస్థితి అయితే లేదు.అందువల్ల తండేల్ మూవీ ఈ రేసులో నిలిచిందని తెలుస్తోంది.

తండేల్ మూవీ సంక్రాంతి రేసులో నిలిస్తే ఒకింత సంచలనమే అవుతుందని చెప్పవచ్చు.తండేల్ సినిమాపై ఇండస్ట్రీలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

చందూ మొండేటి కార్తికేయ2 (Karthikeya 2)తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.ఈ సినిమా నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిందనే సంగతి తెలిసిందే.

Advertisement

సంక్రాంతి రేసులో పరిమిత బడ్జెట్ సినిమాలే సంచలన విజయాలు సాధించిన సందర్భాలు ఉన్నాయి.గేమ్ ఛేంజర్, బాలయ్య బాబీ కాంబో సినిమాలపై అంచనాలు భారీగానే ఉన్నా ఈ రెండు సినిమాలు రొటీన్ మాస్ సినిమాలు అని ఫ్యాన్స్ భావిస్తారు.తండేల్ సినిమా(Thandel movie) రేసులో నిలిస్తే సంచలనాలు పక్కా అని చెప్పవచ్చు.

సంక్రాంతి రేసులో అజిత్ సినిమా కూడా నిలిచే ఛాన్స్ అయితే ఉంది.

పుష్ప2(Pushpa 2) రిలీజైన రెండు వారాలకే తండేల్ (thandel) రిలీజ్ చేయడం రైట్ కాదని ఈ సినిమాకు సంక్రాంతి సీజన్ సరైన సీజన్ అని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఇతర సినిమాలతో పోల్చి చూస్తే తండేల్ సినిమాపై థియేట్రికల్ బర్డెన్ సైతం తక్కువ కావడం గమనార్హం.తండేల్ సినిమా నాగచైతన్య(Naga Chaitanya) రేంజ్ ను పెంచాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

చిరు కొడుకు సినిమాకు పోటీగా నాగ్ కొడుకు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సంక్రాంతి పోటీ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది.

నాకు గ్రీన్ కార్డ్ దక్కుతుందా .. భారత సంతతి సీఈవో ఆందోళన, ఎలాన్ మస్క్ రియాక్షన్
Advertisement

తాజా వార్తలు