భయపెడుతున్న కరెంట్ మరణాలు

సూర్యాపేట జిల్లా:కేవలం పది రోజుల వ్యవధిలో ఒకే మండలంలో ఇద్దరు రైతులు పొలం దగ్గర కరెంట్ షాక్ తో దుర్మరణం చెందడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.24 గంటల ఉచిత విద్యుత్ అని చెనుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మరణాలకు ఏం సమాధానం చెబుతుందని పలువురు సామాజిక కార్యకర్తలు నిలదీస్తున్నారు.

అక్టోబర్ 6 తేదీ గురువారం ఉదయం నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం గ్రామానికి చెందిన రైతు మొగిలిచర్ల నరసయ్య(40) తన సొంత పొలంలోనే కరెంట్ షాక్ కు గురై మరణించగా,సెప్టెంబర్ 27వ తేదీన వాయిలసింగారం మాజీ సర్పంచ్ భర్త బుర్ర పుల్లయ్య(50) తన సొంత పొలంలో కరెంట్ షాక్ కు గురై మరణించడంతో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సొంత మండలం నడిగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ రెండు విషాద ఘటనలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సొంత ఇలాక సూర్యాపేట జిల్లాలో జరగడం గమనార్హం.మునగాల సబ్ డివిజన్ పరిధిలో ఉన్న నడిగూడెం మండలంలో రైతులు పొలాలకు మోటార్లు పెట్టేందుకు వెళ్లి మృత్యువాత పడ్డారని రైతు కుటుంబం సభ్యులు ఆగ్రహం వ్యక్రం చేస్తున్నారు.

విద్యుత్ శాఖా మంత్రి సొంత జిల్లాలో పది రోజుల వ్యవధిలోనే కరెంట్ షాక్ తో ఇద్దరు రైతులు చనిపోవడం బాధాకరమని,ఈ దుర్ఘటనలకు మంత్రి జగదీశ్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలని సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.ఈ రెండు గ్రామాలు మునగాల విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోనే ఉన్నాయని,మంత్రి సొంత జిల్లా,ఎమ్మెల్యే సొంత మండలంలో ఈ దుర్ఘటనలు జరిగినా వారు స్పందించక పోవడం ఏమిటని ప్రశ్నించారు.

ఇప్పటికైనా మంత్రి తక్షణమే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న విద్యుత్ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకొని,ఒక్కో మృతుని కుటుంబానికి పది లక్షల చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు.

Advertisement
కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహిస్తాం : కలెక్టర్

Latest Suryapet News