నక్క కాటుకి గురైన ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు.. యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్‌లో ఘటన

భారత సంతతికి చెందిన యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు, డెమొక్రాటిక్ నేత అమీ బేరాను నక్క కరిచింది.దీంతో సిబ్బంది ఆయనను ఆసుపత్రికి తరలించారు.

యూఎస్ క్యాపిటల్ బిల్డింగ్‌లో ఈ ఘటన జరిగింది.ఈ భవన సముదాయం ఆవరణలో నక్కలు తిరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

తాజాగా అమీ బేరా వ్యవహారంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారడంతో అధికారులు నక్కలను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.సోమవారం సాయంత్రం ఓటింగ్‌కు హాజరయ్యేందుకు అమీ బేరా సెనేట్ ఆఫీస్ బిల్డింగ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు.

ఈ సమయంలో వెనుక నుంచి ఏదో తనపై దూకుతున్నట్లు అనిపించిందని అమీ బేరా తెలిపారు.తొలుత అది చిన్న కుక్కపిల్ల అని భావించానని.

Advertisement

దాని బారి నుంచి తప్పించుకునేందుకు గొడుగుతో కొట్టేందుకు ప్రయత్నించానని.ఈ సమయంలో అది కుక్క కాదని, నక్క అని గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.15 సెకన్ల పాటు అది తనపై దాడి చేసిందని.ఇంతలో ఒక అజ్ఞాత వ్యక్తి గట్టిగా అరవడంతో యూఎస్ క్యాపిటల్ పోలీస్ సిబ్బంది పరుగు పరుగున రావడంతో నక్క పారిపోయినట్లు అమీ బేరా తెలిపారు.

వెంటనే వైద్యుడిని పిలిపించి చికిత్స అందించినట్లు ఆయన పేర్కొన్నారు.ఆపై నాలుగు రాబిస్ ఇంజెక్షన్ల కోర్సు తీసుకోవాలని డాక్టర్ సూచించారని.ఇందుకోసం తాను వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్‌కు వెళ్లినట్లు అమీబేరా తెలిపారు.

గడిచిన పదేళ్లలో క్యాపిటల్ హిల్‌పై ఈ తరహా అనుభవం తనకు ఎదురుకాలేదని ఆయన చెప్పారు.అయితే ఇదే ప్రాంగణంలో గతంలో పలువురు చట్టసభ సభ్యులు నక్కల బారినపడినట్లు పోలీసులు తెలిపారు.క్యాపిటల్ గ్రౌండ్స్‌లో నక్కలు నివసిస్తున్నట్లు జంతు నియంత్రణ సిబ్బంది కనుగొన్నారు.

వాటిని ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలో బోనులో చిక్కిన నక్క ఫోటో వైరల్ అవుతోంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్11, శుక్రవారం 2025
Advertisement

తాజా వార్తలు