England : యూకే : భారత సంతతి డ్రైవర్ దారుణ హత్య.. నలుగురిని నిందితులుగా తేల్చిన కోర్ట్

పశ్చిమ ఇంగ్లాండ్‌లోని ష్రూస్‌బరీలో 23 ఏళ్ల భారత సంతతికి చెందిన డ్రైవర్‌ను హత్య చేసిన ఘటనలో నలుగురు భారత సంతతి వ్యక్తులను కోర్టు దోషులుగా నిర్ధారించింది.

గతేడాది ఆగస్టులో నగరంలోని బెర్విక్ అవెన్యూ( Berwick Avenue ) ప్రాంతంలో జరిగిన దాడికి సంబంధించిన నివేదికలను పరిశీలించిన స్థానిక మెర్సియా పోలీసులు .

హత్యలో ప్రమేయం వుందన్న అనుమానంతో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.దాడి ఘటనలో ఔర్మాన్ సింగ్ ( Aurman Singh )సంఘటనా స్థలంలోనే మరణించినట్లు వారు తెలిపారు.

గొడ్డలి, హాకీ స్టిక్, పారతో సహా ఆయుధాలు కలిగివున్న అర్ష్ దీప్ సింగ్ (24), జగ్‌దీప్ సింగ్ (22), శివదీప్ సింగ్ (26), మంజోత్ సింగ్ (24)లను నిందితులుగా గుర్తించారు.

ఔర్మాన్ సింగ్‌పై దాడిపై వెస్ట్ మార్సియా పోలీస్ డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ (డీసీఐ) మార్క్ బెల్లామీ( Mark Bellamy ) మాట్లాడుతూ.పట్టపగలే హత్య పథకాన్ని అమలు చేయడానికి , ఔర్మాన్ ఎక్కడ వుంటాడో నిందితులు తెలుసుకున్నారని చెప్పారు.నలుగురు వ్యక్తులు తొలుత తమపై వచ్చిన అభియోగాలను ఖండించారు.

Advertisement

కానీ స్టాఫోర్డ్ క్రౌన్ కోర్టులో ఆరు వారాల విచారణ తర్వాత జ్యూరీ వారిని దోషులుగా నిర్ధారించింది.ఈ హత్యకు సహకరించిన మరో భారత సంతతి వ్యక్తిని సుఖ్‌మన్‌దీప్ సింగ్ ( Sukhmandeep Singh )(23)గా గుర్తించారు.

ఇతను ఘటన జరిగిన రోజున ఔర్మాన్ డెలివరీలు ఎక్కడెక్కడ చేస్తున్నాడో నిందితులకు సమాచారం అందించాడు.

మన పట్టణాలు, నగరాల్లోకి వచ్చి హింసాత్మక నేరాలకు పాల్పడవచ్చని భావించే వారికి నేటి తీర్పు బలమైన సంకేతాలు పంపాలని బెల్లామీ ఆకాంక్షించారు.ఈ కేసు దర్యాప్తులో దేశవ్యాప్తంగా పోలీసు బలగాలు పాల్గొన్నాయి.న్యాయ విచారణపై మృతుడు ఔర్మాన్ సింగ్ కుటుంబం స్పందించింది.

ఈ రోజు ఒక తల్లి తన కొడుకు లేకుండా వృద్ధాప్యాన్ని గడుపుతోంది.సోదరి సోదరుడు లేకుండా పెరుగుతోంది.

నేడు ఏపీ లో ప్రధాని మోదీ ఎన్నికల టూర్ .. షెడ్యూల్ ఇదే
నిజ్జర్ హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్ట్ , జస్టిన్ ట్రూడో ఫస్ట్ రియాక్షన్

మా కుటుంబంలో జరిగినది మరొకరికి జరగకూడదని ఔర్మాన్ ఫ్యామిలీ ఓ ప్రకటనలో తెలిపింది.ఈ క్లిష్ట సమయంలో తమకు అండగా నిలిచి దర్యాప్తు నిర్వహించిన పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

అయితే పోలీసుల దర్యాప్తులో అసలు ఔర్మాన్ సింగ్‌ను ఎందుకు చంపాల్సి వచ్చిందనే విషయమై ఇంకా ఎలాంటి ఆధారాలు దొరకలేదు.

తాజా వార్తలు