Chandrababu : వైసీపీ నేతల డిపాజిట్లు గల్లంతు అవడం ఖాయం..: చంద్రబాబు

నెల్లూరు జిల్లా( Nellore District ) కావలిలో టీడీపీ ప్రజాగళం( TDP Prajagalam ) ప్రచార సభ జరిగింది.ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) మాట్లాడుతూ ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఎన్డీఏ గెలుపు ఖాయమని పేర్కొన్నారు.

 Chandrababu : వైసీపీ నేతల డిపాజిట్లు గ-TeluguStop.com

వైసీపీ నేతల డిపాజిట్లు గల్లంతు అవుతాయని చెప్పారు.ఐదేళ్లుగా యువత కష్టాలు పడుతున్నారన్న చంద్రబాబు టీడీపీ పాలనలో యువతకు ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.

వైసీపీ( YCP ) పాలనలో రైతులకు సాగునీరు, గిట్టుబాటు ధర లేదన్నారు.రాష్ట్రం నుంచి పరిశ్రమలను తరిమేశారని పేర్కొన్నారు.కృష్ణపట్నం పోర్టు ఏమైందో ప్రజలకు తెలుసని చెప్పారు.రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేదు, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

మీ పిల్లలు, యువత భవిష్యత్ కు గ్యారంటీ ఇస్తున్నానని తెలిపారు.ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube