వర్జిన్ గెలాక్టిక్ మరో రోదసి యాత్ర.. ఈసారి నాయకత్వం వహించేది ఆయనే..!!

గత కొన్ని రోజులుగా అంతరిక్ష యాత్రలపై విస్తృతమైన కథనాలు వెలువడుతున్న సంగత తెలిసిందే.‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ సంస్థ అధినేత – బ్రిటీషర్‌ రిచర్డ్‌ బ్రాన్సన్‌ జూలై 11న, అది జరిగిన సరిగ్గా తొమ్మిది రోజులకు జూలై 20న ఆ సంస్థకు బలమైన ప్రత్యర్థి ‘బ్లూ ఆరిజన్‌’ అధినేత– అమెరికన్‌ వ్యాపారి జెఫ్‌ బెజోస్‌ తమ బృందాలతో రోదసీ విహారం చేసి వచ్చారు.

వీటి గురించి ఇవాళ ప్రపంచమంతా గొప్పగా చెప్పుకుంటోంది.త్వరలోనే ‘టెస్లా’ సంస్థ అధినేత ఎలన్‌ మస్క్‌ తన ‘స్పేస్‌ ఎక్స్‌’ సంస్థతో జరిపేది మూడో రోదసి యాత్ర.

నిజానికి, ఇవన్నీ కుబేరుల మధ్య పోటాపోటీ రోదసీ యాత్రలు.అయితేనేం, ఖర్చు పెట్టుకొనే స్థోమతే ఉంటే, ఎవరైనా సరే సునాయాసంగా అంతరిక్ష విహారం చేసి రావచ్చని తెలిపిన నిరూపణలు.

భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం ఓ ప్రధాన రంగంగా ఆవిర్భవించనుందని చాటిచెప్పిన సంఘటనలు.ప్రయోగాలకు సంబంధించి ఈ కుబేరుల మధ్య వైరం నడుస్తున్న సంగతి తెలిసిందే.

తొలుత బెజోస్ అంతరిక్ష యాత్ర గురించి ప్రకటించగా.ఆయన కంటే ముందే రోదసిలోకి వెళ్లిన ఘనతను దక్కించుకున్నారు వర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్.

అయితే వర్జిన్ కంటే ఎత్తుకు వెళ్లి ప్రత్యేకత చాటుకున్నారు బెజోస్.వర్జిన్ గెలాక్టిక్ కంటే మెట్టు పైన ఉండేలా ‘న్యూ షెపర్డ్‌’ యాత్ర సాగింది.

బ్రాన్సన్‌ సంస్థకు చెందిన యూనిటీ-22 వ్యోమనౌక.నేల నుంచి 88 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న సంగతి తెలిసిందే.

బెజోస్‌ వ్యోమనౌక మాత్రం 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది.భూవాతావరణం దాటాక అంతరిక్షం ఎక్కడ మొదలవుతుందన్నదానిపై నిర్దిష్ట నిర్వచనమేమీ లేదు.

అమెరికా ప్రమాణాల ప్రకారం చూస్తే 80 కిలోమీటర్ల ఎత్తులో అది మొదలవుతుంది.దీన్ని ప్రామాణికంగా చేసుకొని బ్రాన్సన్‌ 88 కిలోమీటర్ల ఎత్తులోకి వెళ్లొచ్చారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

అయితే ఫెడరేషన్‌ ఏరోనాటిక్‌ ఇంటర్నేషనల్‌ (ఎఫ్‌ఏఐ) మాత్రం 100 కిలోమీటర్ల ఎత్తు తర్వాత అంతరిక్షం మొదలవుతుందని నిర్వచించింది.దీంతో బెజోస్ 106 కిలోమీటర్లు అంతరిక్ష యాత్ర చేశారు.

ఈ క్రమంలో ఎలన్ మస్క్ కూడా తన రోదసి యాత్రకు ఏదో ఒక స్పెషాలిటీ ఉండేలా చూసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.ఇక అసలు విషయంలోకి వెళితే.వర్జిన్ గెలాక్టిక్‌ తదుపరి యాత్రలో వర్జిన్ గెలాక్టిక్ హోల్డింగ్స్ మాజీ సీఈవో జార్జ్ వైట్ సైడ్స్ భాగం కానున్నారు.

వ్యోమనౌక ద్వారా జార్జ్ అంతరిక్షంలోకి వెళ్లనున్నట్లు అమెరికన్ మీడియా తెలిపింది.అయితే జూలై 11న వర్జిన్ గెలాక్టిక్ విజయవంతంగా తన యాత్రను పూర్తి చేసుకున్న తర్వాత.తన సిబ్బంది, సన్నిహితులకు బ్రాన్సన్ పార్టీ ఇచ్చారు.

ఈ కార్యక్రమానికి నాసా మాజీ డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ లోరీ గార్వర్ హాజరయ్యారు.ఆ సమయంలో వర్జిన్ గెలాక్టిక్ తదుపరి ప్రయాణానికి జార్జ్ నాయకత్వం వహిస్తారని బ్రాన్సన్ చెప్పినట్లుగా లోరీ గార్వర్ సీఎన్‌బీసీకి తెలిపారు.

అయితే ఈ కథనాలపై వర్జిన్ గెలాక్టిక్ స్పందించలేదు.

తాజా వార్తలు