అన్న నుంచి విడిపోతున్న తమ్ముడు

అన్న నుంచి తమ్ముడు విడిపోవడం అంటే ఆస్తులు, అప్పులు పంచుకొని వేరుపడటం కాదు.ఇది రాజకీయ వ్యవహారం.

అన్న పేరు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రి.

ఆయన చిన్న తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి.ఇతను రాజకీయ నాయకుడు కాదు.

అన్న కిరణ్ కు అండగా ఉంటూ వ్యాపారాలు చేసుకునే వాడు.గత ఎన్నికల్లో ఇతని పేరు వినిపించింది.

Advertisement

కిరణ్ కుమార్ జై సమైఖ్యాంధ్ర పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసిన సంగతి తెలిసిందే.అప్పుడు వై కా పా చేతిలో ఓడిపోయాడు.

కిరణ్ కుమార్ తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా తన నియోజకవర్గంలో తమ్ముడిని నిలబెడితే ప్రజలు ఓడించారు.ఆ తమ్ముడు టీడీపీలో చేరుతున్నాడని సమాచారం.

ఇందుకు రంగం సిద్ధం అయిందని తెలుస్తోంది.కిషోర్ చేరికకు బాబు కూడా ఒప్పుకున్నాడట.

భవిషత్తులో మంత్రి పదవి కూడా ఇస్తారని అంటున్నారు.కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పరమ శత్రువులు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
ఈ దశలో గాజు గ్లాసు గుర్తు మార్చలేం తేల్చి చెప్పిన ఈసీ..!!

పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది.కానీ కిషోర్ రాజకీయాల్లో లేడు.

Advertisement

ఆయనకు, చంద్రబాబుకు మధ్య గొడవలు లేవు.కాబట్టి చంద్రబాబుకు సమస్య ఉండకపోవచ్చు.

అసలు తమ్ముడిని అన్నయ్యే టీడీపీలోకి పంపుతున్నాదేమో.రాజకీయాల్లో ఇలాంటివి కొత్త కాదు.

తెర వెనుక ఎన్ని నాటకాలైనా జరుగుతాయి.గతంలో కిరణ్ బీజేపీలో చేరుతాడనే ప్రచారం జరిగింది.

కానీ తరువాత ఏ సమాచారమూ లేదు.తమ్ముడి దారి తెలిసింది.

మరి కిరణ్ దారి ఏమిటో? .

తాజా వార్తలు