మొబైల్ ఎక్కడైనా మరచిపోయారా? అయితే ఇలా చేయండి.. తిరిగి పొందవచ్చు!

స్మార్ట్ ఫోన్ అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నేటి ప్రపంచంలో దీని అవసరం చిన్నపిల్లలనుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ వుంది.

 Forgot Your Mobile Somewhere But Do This And Get It Back Mobile , Forgot, Technology Updates, Technology News, Find My Device-TeluguStop.com

అందువలన నేడు ప్రతి మనిషి జీవితంలో ఇది ఓ భాగమై కూర్చుంది.దాదాపు మనకు కావలసిన ముఖ్య సమాచారం అంతా ఇందులో పొందు పరుస్తాం.

బ్యాంక్ లావాదేవీలు మొదలుకొని ఆన్లైన్ షాపింగ్ వరకు ప్రతిఒక్కటి మొబైల్ ద్వారానే చేస్తుండడంతో మొబైల్ ఒక్క క్షణం చేతిలో లేకపోయిన ఎంతో వెలితిగా అనిపిస్తుంది.అయితే మనం బయటకి వెళ్ళినపుడు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటూ మొబైల్ ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉంటాము.

 Forgot Your Mobile Somewhere But Do This And Get It Back Mobile , Forgot, Technology Updates, Technology News, Find My Device -మొబైల్ ఎక్కడైనా మరచిపోయారా అయితే ఇలా చేయండి.. తిరిగి పొందవచ్చు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో ఎంత వెతికినా కొన్ని సార్లు మొబైల్ దొరకదు.అలాగే కొన్ని సార్లు మన మొబైల్ చోరీకి గురవుతూ ఉంటుంది.అలాంటి సమయాల్లో చాలా మందికి ఏం చేయాలో అర్థం కాదు.అల్లాడిపోతూ వుంటారు.

అయితే మొబైల్ పోయిందని కంగారు పడకుండా.కొన్ని టిప్స్ పాటించడం వల్ల మొబైల్ ఎక్కడ మర్చొపోయామో సులభంగా గుర్తించవచ్చు.

అవేంటో ఇపుడు ఒకసారి చూద్దాం…

1.ముందుగా మనం మొబైల్ డేటా మరియు లొకేషన్ ఆన్ లోనే వుందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి.ఇలా చేయడం వల్ల ముబైల్ ను గుర్తించడం చాలా తేలిక అవుతుంది.

2.ఇక ఎక్కడైనా మర్చిపోయిన మొబైల్ ను గుర్తించేందుకు ముందుగా వేరే మొబైల్ లో మీ గూగుల్ అకౌంట్ తో లాగిన్ అవ్వాలి.

3.అలా లాగిన్ అయిన తరువాత గూగుల్ సర్చ్ బార్ లో “FIND MY DEVICE” అని సర్చ్ చేయాలి.ఆ తరువాత గూగుల్ అఫిసియల్ లింక్ అయిన “find my device” ఆప్షన్ ఎంచుకోవాలి.అప్పుడు మొబైల్ ఎక్కడ ఉందో చూపే వెబ్ సైట్ ఒకటి ఓపెన్ అవుతుంది.

4.అక్కడ మీరు లాగిన్ అయిన గూగుల్ అకౌంట్ ఎన్ని మొబైల్స్ లో యాక్టివ్ గా ఉందో కనబడుతుంది.అప్పుడు మీరు మర్చిపోయిన మొబైల్ ను ఎంచుకోవాలి.అప్పుడు మీరు మర్చిపోయిన మొబైల్ ఉన్న లొకేషన్ అక్కడ కనిపిస్తుంది.

5.ఒకవేళ మీ మొబైల్ ను మీకు తెలియని ఇతరులు తీసుకున్నప్పుడు మీ పర్సనల్ డేటా ను వారు దొంగిలించకుండా find my device లో పూర్తిగా కూడా తొలగించవచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube