ఒంట్లో ఐరన్ తక్కువైతే ప్రమాదం.. ఇవి తినండి

ఒంట్లో రక్తం ఉత్పత్తి జరగాలంటే ఐరన్ కావాల్సిందే.శరీరంలో ఉండే ఐరన్ లో 70% మన రక్తంలోనే ఉంటుంది.

కాబట్టి, ఐరన్ ఖచ్చితంగా శరీరానికి అవసరము.మరీ ముఖ్యంగా మహిళలకి.రక్తస్రావం వలన మహిళలు రక్తాన్ని కోల్పోతూ ఉంటారు.

అందుకే ఐరన్ డెఫిషియన్సితో ఎక్కువగా ఆడవారే బాధపడుతారు.ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే ఐరన్ బాగా దొరికే ఆహారం తినాలి.

అవేంటంటే .* పంప్కిన్ సీడ్స్ లో ఐరన్ బాగా దొరుకుతుంది.ప్రతి 100 గ్రాముల్లో 15 మిల్లిగ్రాముల ఐరన్ దొరుకుతుంది.

Advertisement

* లివర్ లో ఐరన్ శాతం ఎక్కువే.చికెన్ లివర్, బీఫ్ లివర్ తినొచ్చు.

అలాగే రెడ్ మీట్ లో కూడా ఐరన్ దొరుకుతుంది.* బీట్ రూట్స్ లో ఐరన్ మంచి మోతాదులో లభిస్తుంది.

ఐరన్ కోసం తినాలనుకుంటే, ఇవి క్యారట్ కన్నా మెరుగైన ఆప్షన్.* పాలకూరలో ఐరన్ బాగా లభిస్తుంది.

దీన్ని పచ్చిగా కూడా తినొచ్చు.* కాయధాన్యాలలో కూడా ఐరన్ దండిగా లభిస్తుంది.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వర్షాకాలంలో ఖ‌చ్చితంగా ఈ కూరగాయలు తినాలి.. తెలుసా?

ఇందులో ప్రొటీన్ కూడా ఉంటుంది కాబట్టి, శాఖాహారులకి ఇది మంచి ఆహారం.* ఫలాల్లో తీసుకుంటే, వాటర్ మిలన్, స్ట్రాబెరి, డేట్స్ లో ఐరన్ బాగా దొరుకుతుంది.

Advertisement

* సోయాబీన్ లో ఐరన్ శాతం చాలా ఎక్కువగానే దొరుకుతుంది.ప్రతి వంద గ్రాముల సోయాబీన్స్ లో ఎకంగా 15.70 గ్రాముల ఐరన్ శాతం ఉండటం విశేషం.* ధాన్యాలలో కూడా ఐరన్ శాతం దండిగా దొరుకుతుంది.

అన్ని వదిలేసి కేవలం ధాన్యాల మీద పడ్డా సరే, శరీరానికి అవసరమైన ఐరన్ దొరికేస్తుంది.* అయితే, ఐరన్ బాగా తీసుకోవడం మాత్రమే కాదు, ఐరన్ ని శరీరం బాగా అబ్జర్వ్ చేసుకోవాలంటే విటమిన్ సి కూడా అవసరం.

కాబట్టి అటు ఐరన్ దొరికే ఆహారం, ఇటు విటమిన్ సి దొరికే ఆహార రెండింటిపై దృష్టి కేంద్రీకరించాలి.

తాజా వార్తలు