పిల్లలకు పాలు పడుతున్నప్పుడు ఈ ఆహరం వద్దు

పసిపిల్లలకు తల్లిపాలే ఆహారం, అమృతం.అయితే దాన్ని చెడు అలవాట్లతో విషంగా మార్చకూడదని మనందరికి తెలిసిందే.

సిగరెట్లు, మద్యం .ఇలాంటి అలవాట్లు మానెయ్యాలని కొత్తగా చెప్పనక్కరలేదు.అయితే చాలామంది ఊహించని విధంగా కొన్ని ఆహారపదార్థాలు పాలుపట్టే తల్లులు తీసుకోకపోవడమే మంచిది.

అవేటంటే .* సిట్రస్ ఫలాలు పాలు పట్టే తల్లులు తీసుకోకపోతే మేలు.ఎందుకంటే పిల్లల GI అప్పటికి ఇంకా ఎదిగి ఉండదు.

నారింజ లాంటి సిట్రస్ ఫలాలలో ఉండే కొన్ని లక్షణాలు ఈ కారణంగా పిల్లలకి చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి.అలా అనిపిస్తే ఇంకేముంది .వెంటనే ఏడుపందుకుంటారు.* పాలు పడుతున్న తల్లి కాఫీ కూడా తాగకూడదు.

Advertisement

ఎందుకంటే కెఫైన్ ని తల్లి శరీరం బాగానే తీసుకుంటుంది కాని, పసివారి శరీరం ఇంకా కెఫైన్ ని తీసుకునేందుకు సిద్ధంగా ఉండదు.* చాకొలెట్లు కూడా పసిపిల్లలకి సరిగా పడవని పరిశోధనలు చెబుతున్నాయి.

తల్లి చాకోలేట్ తిన్నాక పాలిస్తే, ఆ తరువాత బిడ్డ ఏడ్చినా, మలవిసర్జన చేసినా, చాకొలెట్లు తినడం ఆపేయ్యాల్సిందే.* అన్నిరకాల చేపలు పిల్లలకి మంచివి కావు.కాబట్టి ఎలాంటి సీ ఫుడ్ తీసుకోవాలో డాక్టర్ ని అడగాలి.

* పాలు పట్టే సమయంలో పార్స్లీ తినటం కూడా మంచిది కాదు.ఇది పాల విడుదలని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

అంటే తల్లి ఇచ్చే పాలు బిడ్టకి సరిపోకపోవచ్చు.

తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు