రోజు నైట్ ఈ చిన్న చిట్కాను పాటిస్తే ఉదయానికి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరిసిపోతుంది!

ఉదయం నిద్ర లేచే సమయానికి ముఖం డల్ గా క‌ల త‌ప్పి ఉంటే ఎవ్వరికీ నచ్చదు.

అటువంటి ముఖాన్ని అద్దంలో చూసుకోగానే ఏదో తెలియ‌ని చిరాకు మ‌న‌సులో మొద‌ల‌వుతుంది.

దాంతో ఆ రోజంతా చాలా మూడీగా కూడా అయిపోతారు.ఇలాంటి సందర్భాలు మీకు ఎదురయ్యాయా.? అయితే ఇప్పుడు చెప్పబోయే చిన్న చిట్కా మీకు అద్భుతంగా సహాయపడుతుంది.ఈ చిట్కాను రోజు నైట్ నిద్రించే ముందు పాటిస్తే ఉదయానికి ముఖం తెల్లగా, కాంతివంతంగా మెరిసిపోతుంది.

ఇక‌పై డ‌ల్ స్కిన్ అన్న మాటే అన‌రు.మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటి అనేది తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ) వేసుకోవాలి.అలాగే చిటికెడు కుంకుమ పువ్వు, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, నాలుగు లేదా ఐదు చుక్కలు స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Sweet Almond Oil ) వేసుకొని అన్నీ కలిసేలా స్పూన్ స‌హాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.నైట్ నిద్రించడానికి గంట ముందు తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకోవాలి.

Advertisement

ప‌దిహేను నుంచి ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత సున్నితంగా చ‌ర్మాన్ని మసాజ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకోవాలి.నైట్ నిద్రించడానికి ముందు ఈ చిన్న చిట్కాను పాటిస్తే ఉదయానికి చర్మం చాలా కాంతివంతంగా మారుతుంది.

అలాగే క్రమక్రమంగా స్కిన్ టోన్ పెరుగుతుంది.ఈ చిట్కాను పాటిస్తే మీ చర్మం తెల్లగా మారడాన్ని మీరే గమనిస్తారు.

అలాగే ఈ చిట్కాను పాటించడం వల్ల స్కిన్‌ స్మూత్ గా తయారవుతుంది.టాన్ ఉంటే రిమూవ్ అవుతుంది.

డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.మరియు ఈ చిట్కాను పాటించ‌డం వ‌ల్ల‌ ముడతలు, చారలు, చర్మం సాగడం వంటి వృద్ధాప్య సంకేతాల‌కు సైతం దూరంగా ఉండవచ్చు.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు