మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో నిన్న కేసీఆర్ తుంటి ఎముక సర్జరీ జరిగిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తుంటి ఎముక మార్పిడి సర్జరీ అనంతరం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.అయితే ఆయనకు ఆరు నుంచి ఎనిమిది వారాల రెస్ట్ అవసరమని పేర్కొన్నారు.
ఈ మేరకు యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.అయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఆయన ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోవడంతో కాలికి గాయమైన సంగతి తెలిసిందే.