ఈ వేసవికాలంలో చెమట వాసనతో బాధపడుతున్నారా..? అయితే ఈ సింపుల్ చిట్కా మీ కోసమే..!

వేసవిలో ఎండలు( Summer ) బాగా మండిపోతున్నాయి.ఒక్క పది నిమిషాలు ఎండలోకి వెళ్ళొచ్చినా కూడా చెమటతో( Sweat ) పూర్తిగా తడిసిపోతున్నాం.

ఇక ఆఫీసులకు వెళ్లేవారు, దూర ప్రయాణాలు, ఎక్కువగా చెమటతో బాధపడుతున్నారు.దీనివల్ల శరీరం నుండి దుర్వాసన కూడా వస్తూ ఉంటుంది.మార్కెట్లో దొరికే పెర్ఫ్యూముల కన్నా ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ చెమట వాసనను సహజంగా దూరం చేయొచ్చు.

ఎండాకాలంలో తప్పకుండా రెండుసార్లు చల్ల నీటి స్నానం( Cold Bath ) చేయడం చాలా మంచిది.దీనివల్ల శరీర దుర్వాసన తగ్గిపోతుంది.ఎందుకంటే ఇలాంటి సమయంలో వేడి నీళ్ల జోలికి పోకపోవడం మంచిది.

Follow These Simple Tips To Reduce Odour From Sweat In Summer Details, Summer Ti

ఇక స్నానం చేసే నీళ్లలో ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ రెండు చుక్కలు వేసుకుంటే శరీర దుర్వాసన దరికి రాదు.శరీరానికి సాంత్వన దొరుకుతుంది.దీంతో చెమట వాసన అసలు రాదు.

టీట్రీ, లావెండర్, రోజ్ మెర్రి ఇలాంటి నూనెలని వాడడం మంచిది.కలబందలో ( Aloevera ) యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి.

Follow These Simple Tips To Reduce Odour From Sweat In Summer Details, Summer Ti

అందుకే కలబంద గుజ్జును తీసుకొని దూది సాయంతో చెమట ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో రాయాలి.ఇలా పది నిమిషాలు అయ్యాక కడిగేసుకుంటే ఇక అంతే ఇలా రోజుకోసారి చేస్తే చాలు చెమట వాసన తగ్గిపోతుంది.

అంతేకాకుండా కొలాజిన్ ఉత్పత్తి పెంచడంలో చర్మం మీద ఉన్న మచ్చలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

Follow These Simple Tips To Reduce Odour From Sweat In Summer Details, Summer Ti

బ్యాక్టీరియా వల్లే చెమట దుర్వాసన వస్తుంది.అందుకే బ్యాక్టీరియా ను దూరం చేసే వాటిని వాడడం మంచిది.వేపాకులో బ్యాక్టీరియాని చంపే గుణాలు ఉంటాయి.

అందుకే వేపాకులను మెత్తగా పేస్ట్ చేసి చెమట వచ్చే అండర్ ఆర్మ్స్ లేదా పాదాల కింద రాసుకోవాలి.ఇలా పావుగంట రాసుకొని ఆరాక కడిగేసుకుంటే చాలు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

ఇది రోజు చేయవచ్చు.అంతేకాకుండా దీనికి బదులుగా టమాటా కూడా వాడవచ్చు.

టమాటా గుజ్జు చెమట ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

తాజా వార్తలు