నిర్దిష్టమైన లక్ష్యం వైపు దృష్టి సారించాలి: పోలీస్ కమిషనర్

లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ పోలీస్ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు పలు సూచనలు చేశారు.

పోలీసు ఉద్యోగాల ఉచిత శిక్షణ కోసం ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 175 మంది అభ్యర్థులకు పోలీస్ శాఖ పర్యవేక్షణలో ఖమ్మం పోలీస్ శిక్షణ కేంద్రంలో ఇస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు పోలీస్ కమిషనర్ సందర్శించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సర్కారు పెద్ద సంఖ్యలో పోలీసు ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగ యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వడం గొప్ప ఆవకాశంగా భావించి సద్వినియోగం చేసుకొవాలని సూచించారు.మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రిపరేషన్‌ ఉండాలని, ఒక్కో సబ్జెక్ట్‌కు కొంత టైం కేటాయించుకొని పక్కా ప్రణాళికతో సిద్ధమైతే కొలువు సాధించడం సులువు ఆవుతుందన్నారు.

ప్రధానంగా అభ్యర్థులకి శిక్షణలో క్రమశిక్షణ చాల ముఖ్యమని అన్నారు.లక్ష్యం వైపు దృష్టి పెట్టి ఇండోర్, ఆవుట్ డోర్ శిక్షణను నిబద్ధత, అంకితభావంతో నేర్చుకొని విజయం సాధించి పోలీస్ యూనిఫాంలో ఉద్యోగం చేయాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ ,AR అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏసీపీ ప్రసన్నకుమార్, ఆర్ఐలు రవి, శ్రీనివాస్, తిరుపతి ,శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
బీజేపీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.. : డిప్యూటీ సీఎం భట్టి

Latest Khammam News