రాజేంద్రనగర్ పరిధిలోని ఉస్మాన్ సాగర్ చెరువుకి భారీగా వరద నీరు

రంగారెడ్డి జిల్లా :- రాజేంద్రనగర్ పరిధిలోని ఉస్మాన్ సాగర్ చెరువుకి భారీగా వరద నీరు చేరుతోంది.ఈ నేప‌థ్యంలో జ‌ల‌మండ‌లి అధికారులు ఈరోజు ఉస్మాన్ సాగ‌ర్ 4 గేట్ల‌ను 3 ఫీటు పైకి ఎత్తి నీటిని దిగువ‌కు వదిలారు.

ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 1786.70 అడుగులకు చేరడంతో గేట్లను ఎత్తినట్లు అధికారులు తెలిపారు.నీటిని వడలడం వలన నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో మంచిరేవుల విలేజ్ కు రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి.

దీనితో మంచిరేవుల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సోదరి, బావ కలిసి చేతబడి చేశారంటూ పోలీస్ కంప్లైంట్.. అధికారులు షాక్..??

తాజా వార్తలు