జుట్టు ఒత్తుగా, దృఢంగా పెర‌గాలా? అయితే మీరీ న్యాచుర‌ల్ జెల్ వాడాల్సిందే!

జుట్టు ఒత్తుగా, దృఢంగా పెర‌గాల‌ని అంద‌రూ కోరుకుంటారు.అందుకోస‌మే జుట్టుపై ఎన్నెన్నో ప్ర‌యోగాలు చేస్తుంటారు.

అయితే ఎన్ని చేసినా, అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కొంద‌రిలో జుట్టు పెర‌గ‌డం అటుంచు.ఊడ‌టం మాత్రం అధికంగా ఉంటుంది.

ఈ క్ర‌మంలోనే వారు మాన‌సికంగా కృంగిపోతుంటారు.అయితే ఇక‌పై చింతించాల్సిన ప‌ని లేదు.

ఎందుకంటే ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ జెల్‌ను మీ హెయిర్ యూజ్ చేస్తే రాల‌డం త‌గ్గి జుట్టు ఒత్తుగా, స్ట్రోంగ్ గా పెరుగుతుంది.

Flaxseed Gel, Stop Hair Fall, Hair Fall, Strong And Thick Hair, Hair Care, Hair
Advertisement
Flaxseed Gel, Stop Hair Fall, Hair Fall, Strong And Thick Hair, Hair Care, Hair

ఇంత‌కీ ఆ జెల్ ఏంటా అని అనుకుంటున్నారా.అదే అవిసెగింజ‌ల జెల్‌.దీనిని ఎలా త‌యారు చేయాలి.? ఎలా హెయిర్‌కు వాడాలి.? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందు ఒక బౌల్‌లో మూడు స్పూన్ల అవిజె గింజ‌లు వేసుకుని వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

అపై అందులో ఒకటిన్న‌ర‌ గ్లాస్ వాటర్ పోసి అర గంట పాటు నాన‌బెట్టాలి.ఇప్పుడు గిన్నెలో వాట‌ర్‌తో స‌హా నాన‌బెట్టుకున్న అవిసెగింజ‌ల‌ను వేసి ఆరేడు నిమిషాల పాటు హీట్ చేయాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని చ‌ల్లార‌నిచ్చి.జెల్ తీసుకోవాలి.

ఇక ఈ జెల్‌ను జుట్టుకు ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఒక బౌల్ తీసుకుని అందులో ఐదు స్పూన్ల అవిసె గింజ‌ల జెల్‌, ఒక స్పూన్ విట‌మిన్ ఇ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టుకు కుద్ద‌ల‌కు ప‌ట్టించాలి.గంట అనంత‌రం కెమిక‌ల్స్ త‌క్కువగా ఉండే షాంపూ యూజ్ చేసి హెడ్ బాత్ చేయాలి.

Advertisement

ఇలా వారంలో రెండు సార్లు చేస్తే హెయిర్ ఫాల్ త‌గ్గి ఒత్తుగా, బ‌లంగా పెరుగుతుంది.

అలాగే ఒక బౌల్‌లో ఐదారు స్పూన్ల అవిసె గింజ‌ల జెల్‌కు రెండు స్పూన్ల అలోవెర జెల్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.అపై ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి గంట అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.నాలుగు రోజుల‌కు ఒక సారి ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

తాజా వార్తలు