మ‌ళ్లీ స్పీడ్‌ పెంచిన ఫైర్ బ్రాండ్ ధ‌ర్మ‌పురి.. హుజూరాబాద్ కేడ‌ర్‌లో జోష్

తెలంగాణ బీజేపీలో ఆ ద్వ‌యాన్ని చూస్తే ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు అంద‌రూ మోడీ, షా ద్వ‌యంలాగే స‌క్సెస్ అవుతున్నారంటూ మురిసిపోతుంటారు.

అలాంటి ద్వ‌యంలో ఓ ఫైర్ బ్రాండ్ చాలా కాలంగా సైలెంట్ అయిపోయారు.

ఎందుకో ఏంటో తెలీదు గానీ త‌న మాట‌ల తూటాల‌ను త‌గ్గించుకుని సైలెంట్ రాజ‌కీయాలు చేశారు.కానీ ఇప్పుడు మ‌ళ్లీ ట్రాక్ ఎక్కిన‌ట్టు క‌నిపిస్తున్నారు.

త‌న కౌంట‌ర్ల‌తో మ‌ళ్లీ పార్టీలో జోష్ పెంచేస్తున్నారు.ఆయ‌నే నిజ‌మాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌.

ప్ర‌స్తుతం ఆయ‌న హుజూరాబాద్‌లో పార్టీని ప‌రుగులు పెట్టిస్తున్నారు.ఎప్పుడైతే ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో చేరారో అప్ప‌టి నుంచే ఆయ‌న కొంచెం సైలెంట్ అయిపోయిన‌ట్టు క‌నిపించింది.

Advertisement
Fire Brand Dharmapuri Speeds Up Again Josh In Huzurabad Cadre, Huzurabad , Dharm

పెద్ద‌గా ఎలాంటి కామెంట్లు చేయ‌కుండా మౌనంగా ఉన్న ఆయ‌న ఇప్పుడు మ‌ల్లీ ఘాటు కౌంట‌ర్ల‌తో విరుచుకుప‌డుతున్నారు.టీఆర్ఎస్ నేతల కౌంట‌ర్ల‌కు రీ కౌంట‌ర్లు వేస్తూ దుమ్ము లేపుతున్నారు.

హుజూరాబాద్ లో ఈట‌ల రాజేంద‌ర్ త‌ర‌ఫున ప్ర‌చారాలు చేస్తూ త‌న‌దైన దూకుడున ప్ర‌ద‌ర్శిస్తున్నారు.దీంతో హుజూరాబాద్ కేడ‌ర్‌లో ఫుల్ జోష్ క‌నిపిస్తోంద‌తి.

ఇక ఆయ‌న రీసెంట్ గా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.హుజూరాబాద్ లో ఈట‌ల రాజేంద‌ర్ గ‌తంలో చేసిందేమీ లేదంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారానికి తన స్టైల్‌లో ధ‌ర్మపురి అర‌వింద్ గ‌ట్టి పంచ్ ఇచ్చేశారు.

Fire Brand Dharmapuri Speeds Up Again Josh In Huzurabad Cadre, Huzurabad , Dharm

ఈట‌ల రాజేంద‌ర్ చేసిందేంటో ప్ర‌జ‌ల‌కు తెలుస‌ని లేక‌పోతే ఇన్ని రోజులు మీ పార్టీలో ఉన్న‌ప్పుడు ఎందుకు అన‌లేదంటూ మండిప‌డ్డారు.అంతే కాదు ఈట‌ల గెలిస్తే ఏమొస్తదంటున్నార‌ని.ఈట‌ల గెలిస్తే కేసీఆర్ బుద్దొస్తద‌ని చెప్ప‌డం హైలెట్‌గా మారింది.

చిరు, బాలయ్య రిజెక్ట్ చేసిన డైరెక్టర్ కు నాగార్జున ఛాన్స్ ఇస్తారా.. ఏమైందంటే?
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

ఏదేమైనా మ‌ళ్లీ ధ‌ర్మ‌పురి ఫామ్‌లోకి వ‌చ్చేసారని ఆయ‌న అభిమానులు తెగ సంబుర ప‌డుతున్నారు.ఒక‌ప్పుడు ఈట‌ల విష‌యంలో సైలెంట్ గా ఉన్న ఆయ‌న ఇప్పుడు ఈట‌ల‌ను గెలిపించేందుకు బాగానే ప్ర‌య‌త్నిస్తున్నారు.

Advertisement

మ‌రి ఫ‌లితం ఎలా ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు