మాడుగులపల్లి మండల కేంద్రంలో రైతులు ఆందోళన

నల్లగొండ జిల్లా:వరద కాలువ నీళ్లు వదలాలని, కాలువకు ఉన్న తూములను వెంటనే క్లోజ్ చేసి,చివరి ఆయకట్టు గ్రామాలకు నీళ్లు చేరే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో రైతు సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి రైతులు ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరద కాలువకు నీళ్లు వదిలి 20 రోజులు గడుస్తున్నా మాడుగులపల్లి మండలానికి ఇంతవరకు నీరు చేరుకోవడం లేదని, దీనితో రైతులు చాలా నష్టపోతున్నారని,ఇప్పటికైనా అధికారులు స్పందించి కాల్వ చివరి ఆయకట్టు అమలకు నీరు చేరే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు.

రైతుల ఆందోళనతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని,ధర్నా విరమించాలని కోరగా,సంబంధిత అధికారులు వచ్చే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని రైతులు భీష్మించుకు కూర్చున్నారు.

ఆరోగ్యానికి వరం చుక్కకూర.. వారానికి ఒక్కసారి తిన్న లాభాలే లాభాలు!

Latest Nalgonda News