పవన్ పై అభిమానంతో పెళ్లికార్డుపై జనసేన గుర్తు.. ఈ అభిమాని అభిమానానికి ఫిదా అవ్వాల్సిందే!

మామూలుగా అభిమానులు వారి అభిమాన సెలబ్రిటీపై ఉన్న అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చాటుకుంటూ ఉంటారు.

కొందరు వారి పేరు మీద దానధర్మాలు చేస్తే మరి కొందరు రక్తదానాలు వంటివి చేస్తుంటారు.

కొందరు వారి పేర్లు వారి ఫోటోలు టాటూలు వేయించుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు.ఇలా ఒకొకరు వారికి తోచిన విధంగా వారి అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు.

అయితే తాజాగా ఒక అభిమాని కూడా అలాంటి పని చేశాడు.ఆ అభిమాని చేసిన పనికి ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.

ఇంతకీ ఆ అభిమని ఎవరు? ఏం చేశాడు అన్న వివరాల్లోకి వెళితే.పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఒకరు పవన్ కళ్యాణ్ పై అభిమానాన్ని కొత్త రీతిలో వ్యక్తపరిచాడు.తన పెళ్లి కార్డులో పవన్ కళ్యాణ్ ఫొటోను ముద్రించి పెళ్లి కార్డులను బంధులవులకు పంచాడు.

Advertisement

దీనికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఖమ్మం జిల్లా( Khammam District ) ముదిగొండ మండలం వల్లపురం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ కుటుంబరావు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ వీరాభిమాని.

పవన్ పుట్టిన రోజున ఎన్నో సార్లు రక్తదానం కూడా చేసిన రోజులు ఉన్నాయి.

పవన్ నటించిన ఏ సినిమా అయినా మొదటి రోజే చేసేవాడు.అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ( Pawan kalyan)ఏపీకి డిప్యూటీ సీఎం అవ్వడంతో ఎంతో సంతోషించానని చెప్పుకొచ్చాడు.తనపై అభిమానాన్ని తన పెళ్లి కార్డులో జనసేనాని ఫోటో, అలాగే పార్టీ గుర్తును ముద్రించి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నువ్వు గ్రేట్ బ్రో సూపర్ బ్రో అంటూ కామెంట్ చేస్తున్నారు పవన్ అభిమానులు.

నయనతారతో ఆ సినిమా చేసి తప్పు చేశా.. ప్రముఖ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు