ప్రేమతో ఎక్స్ ప్రెస్ హరికి ముద్దు పెట్టిన అషురెడ్డి.. అసలేం జరిగిందంటే?

బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన కామెడీ స్టార్స్ షో మంచి టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈ షోలో ఎక్స్ ప్రెస్ హరి, అషురెడ్డి జోడీ చేసే కామెడీ స్కిట్లు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా రిలీజన కామెడీ స్టార్స్ ప్రోమోలో అషురెడ్డి ఎక్స్ ప్రెస్ హరికి ముద్దు పెట్టడం గమనార్హం.గతంలో స్కిట్లలో ముద్దులు పెట్టిన అషురెడ్డి ఈసారి మాత్రం స్కిట్ లో కాకుండా షోలో ప్రేమగా ముద్దు పెట్టడం గమనార్హం.

కొన్ని నెలల క్రితం అషురెడ్డి, ఎక్స్ ప్రెస్ హరి మధ్య ఏదో ఉందని వార్తలు తెగ వైరల్ అయ్యాయి.ఆ సమయంలో ఎక్స్ ప్రెస్ హరి తన అన్నయ్య అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి అషురెడ్డి వార్తల్లో నిలిచారు.

ప్రోమోలో శ్రీముఖి ఎక్స్ ప్రెస్ హరిని ఆ పచ్చబొట్టు ఇంకా ఉందా అషురెడ్డి మీద ప్రేమ ఉన్నంతకాలం ఆ టాటూ అక్కడే ఉంటుందని ఎక్స్ ప్రెస్ హరి కామెంట్లు చేయడం గమనార్హం.అషురెడ్డి, ఎక్స్ ప్రెస్ హరికి మధ్య ఉన్న కెమిస్ట్రీ వల్ల వాళ్ల స్కిట్లు హైలెట్ అవుతుండటం గమనార్హం.

Advertisement

లవ్ థీమ్ తో ఈ వారం ఎపిసోడ్ ప్రసారం కానుండగా అవినాష్ కన్నడలో నాన నిన్న ప్రీతిస్తుదేన అని చెప్పగా ప్రీతి, గీత వీటి వెంట పడుతున్నావనే నీతో మాట్లాడటం లేదని అరియానా చెబుతారు.ప్రముఖ నటుడు సత్యదేవ్ ఈ షోకు గెస్ట్ గా హాజరు కాగా ఇంత సిగ్గు పడే వ్యక్తి ప్రేమలో ఎలా పడ్డారని అడుగుతరు.

సిగ్గు పడే వ్యక్తి ప్రేమించకూడదా అంటు సత్యదేవ్ రివర్స్ లో కౌంటర్ ఇవ్వడం గమనార్హం.శేఖర్ మాస్టర్, శ్రీదేవి కలిసి వెన్నెలవే వెన్నెలవే పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసి మెప్పించడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు