అకీరాను పరిచయం చేయబోతున్న వైజయంతి బ్యానర్స్.... డైరెక్టర్ ఎవరో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం రాజకీయాల( politics )లో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక ఈయన  కమిట్ అయిన సినిమాలు షూటింగ్ పూర్తి అయిన అనంతరం సినిమాలకు పూర్తిగా దూరం కాబోతున్నారని తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పైన పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.ఇలా పవన్ సినిమాలకు దూరమవుతున్న ఆయన కుమారుడు అఖీరా ( Akhira )మాత్రం త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినపడుతూనే ఉన్నాయి.

Excite News Viral On Akhira Debute Film , Akhira, Vyjayanthi Movies, Prashanth N

ఇక పవన్ కళ్యాణ్ కుమారుడిని త్రివిక్రమ్ శ్రీనివాస్ కుమారుడి డైరెక్షన్లో ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు అంటూ కూడా గత కొద్దిరోజులుగా వార్తలు వినపడుతున్నాయి.అయితే తాజాగా అకీరా సినీ ఎంట్రీ గురించి మరొక వార్త సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతోంది.అకీరాను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్( Vyjayanthi Movies ) వారు తీసుకున్నారని తెలుస్తుంది అంతేకాకుండా ఈయన ప్రముఖ పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో ఇండస్ట్రీకి   పరిచయం కాబోతున్నారని సమాచారం.

Excite News Viral On Akhira Debute Film , Akhira, Vyjayanthi Movies, Prashanth N

పవన్ కళ్యాణ్ తో పంజా లాంటి స్టైలిష్ మూవీ ని తీసిన విష్ణు వర్ధన్( Vishnu Vardhan ) కూడా అకిరా మొదటి సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఉందట.వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అకిరా మొదటి సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక అకీరా ఎంట్రీ గురించి ఈ విధమైన వార్తలు వస్తున్నా నేపథ్యంలో పవన అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Excite News Viral On Akhira Debute Film , Akhira, Vyjayanthi Movies, Prashanth N

ఇక ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా వెంట తన కొడుకుని తీసుకు వెళ్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే అకీరా ఫర్ఫెక్ట్ హీరో కటౌట్ తో ఉన్నారు అంటూ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆ ఆలోచన వచ్చిన తొలి హీరో చిరంజీవి.. ఏపీ సీఎం సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు