రేవంత్ రెడ్డికి ఈటల రాజేందర్ క్షమాపణ చెప్పాలి:ఎరుకల వెంకటేష్ గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా:టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డిపై చేసిన నిరాధారమైన, అనుచిత వాఖ్యలను వెంటనే ఈటెల రాజేందర్ వెనుకకు తీసుకోని కాంగ్రెస్ పార్టీకి,రేవంతరెడ్డికి క్షమాపణ చెప్పాలని తుర్కపల్లి మండల కాంగ్రేస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎరుకల వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు.

ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రేస్ పార్టీని బలహీనపర్చడానికి బీజేపీ,బీఆర్ఎస్ ఆడుతున్న నాటకంలో భాగంగా ఈటల రాజేందర్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ దగ్గర 25 కోట్లు తీసుకున్నట్టు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమండ్ చేశారు.ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు.

ఈ కార్యక్రంలో మండల కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు తలారి అశోక్, మండల కాంగ్రెస్ నాయకులు కోట సురేష్, ఓర్సు భిక్షపతి,నల్ల బాలకృష్ణ,పిడుగు రమేష్,బూక్యా రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మ‌నం రోజూ ఎంత ప్లాస్టిక్ తింటున్నామో తెలిస్తే ఆశ్చ‌ర్యంతో నోరెళ్ల బెడ‌తారు
Advertisement

Latest Press Releases News