హైదరాబాద్, 14 ఆగస్ట్ 2024: ఆరంభం నుంచే అంతులేని వినోదం అందించడమే లక్ష్యంగా రియాలిటీ షోలు, సీరియల్స్, సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఛానల్ జీ తెలుగు. ప్రేక్షకులకు మరింత వినోదం అందించేందుకు నేరుగా తమ అభిమాన బుల్లితెర నటీనటులను కలిసే అవకాశం అందిస్తూ ఆదోనిలో ఆగస్ట్ 10 శనివారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించింది.
శ్రావణమాసం ప్రత్యేకంగా ఆదోని వేదికగా నిర్వహించిన జీ తెలుగు మెగా ఈవెంట్ ‘శ్రావణలక్ష్మి’ని ఆగస్ట్ 18, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం చేయనుంది.అంతేకాదు! వారం వారం సరికొత్త సినిమాలతో అలరించే జీ తెలుగు ఈ వారం మరో సూపర్ హిట్ సినిమా ప్రేమలుని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా అందించేందుకు సిద్ధమైంది.
నస్లెన్ కె గఫూర్, మమితా బైజు నటించిన ప్రేమలు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఆగస్ట్ 18 ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో మాత్రమే!
జీ తెలుగు ఇటీవల ఆదోనిలో ప్రముఖ నటీనటులతో శ్రావణమాసం ప్రత్యేక కార్యక్రమం ‘శ్రావణలక్ష్మి’ మెగా ఈవెంట్ని నిర్వహించి వీక్షకులకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందించింది.ఈ కార్యక్రమం ఆదివారం జీ తెలుగులో ప్రసారం కానుంది.
మీ అభిమాన యాంకర్ లాస్య వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకులకు వినోదం పంచింది.జీ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ విజయవంతంగా కొనసాగుతున్న జాబిల్లికోసం ఆకాశమల్లే, మా అన్నయ్య సీరియల్స్ నటీనటులు ఈ వేదికపై నుంచి తమ అభిమానులతో సంభాషించి వారి సంతోషంలో పాలుపంచుకున్నారు.
అభిమానుల కోలాహలంతో నిండిన ఈ వేదికపై మా అన్నయ్య సీరియల్ జంట గంగ(గోకుల్ మీనన్)-శివ(స్మృతి కశ్యప్) వివాహతంతు ఘనంగా జరిగింది.ఈ వివాహానికి లాస్య పురోహితుడి పాత్ర పోషించి అందరినీ కడుపుబ్బా నవ్వించింది.
అంతేకాదు, ఈ వేదికపై నటీనటులంతా రక్షాబంధన్ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.ఇక, ఎవర్గ్రీన్ సరిగమప గాయకులైన లక్ష్మీగాయత్రి, సమీర ప్రత్యేక ప్రదర్శన వీక్షకుల హృదయాలను హత్తుకుంది.
జీ తెలుగు తారలు, అభిమానులతో సంగ్రామంలా సాగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆదోని శాసనసభ సభ్యులు పీ.వీ.పార్థసారథి హాజరై అందరిలో మరింత ఉత్సాహం నింపారు.ఈ వేదికపై నిరుపేదల కోసం సోషల్ వెల్ఫేర్ సొసైటీని నిర్వహిస్తూ ప్రజాసంక్షేమం, సేవ కోసం పాటుపడుతున్న సునీతను సన్మానించారు.
అంతేకాదు.వీకెండ్ వినోదాన్ని రెట్టింపు చేసేందుకు ప్రేమలు సినిమాని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా అందిస్తోంది జీ తెలుగు.గిరీష్ ఎ.డి దర్శకత్వం వహించిన ప్రేమలు సినిమా కథ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన సచిన్ (నస్లెన్ కె.గఫూర్) చుట్టూ తిరుగుతుంది.UK వెళ్ళాలకున్న సచిన్ వీసా దరఖాస్తు తిరస్కరించబడుతుంది.
సచిన్ తన స్వగ్రామంలో ఉండటం ఇష్టంలేక తన స్నేహితుడు అమల్ డేవిస్ (సంగీత్ ప్రతాప్) సహాయం కోరతాడు.హైదరాబాద్ లో గేట్ కోచింగ్ తీసుకోవాలనుకున్న అమల్ సచిన్ ను వెంట తీసుకెళ్తాడు.
ఓ పెళ్లిలో రీను (మమితా బైజు)ను కలిసిన సచిన్ వెంటనే ఆమెతో ప్రేమలో పడతాడు.ఆ తర్వాత ఏం జరుగుతుందనేది తెలియాలంటే ప్రేమలు సినిమా చూడాల్సిందే!నస్లెన్ కె.గఫూర్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, అథ్లాఫ్ సలీం తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.ఈ సినిమాలో ప్రతి ఒక్కరి నటన అందరినీ ఆకట్టుకుంటుంది.
కామెడీ, సెంటిమెంట్ మేళవింపుతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.మనసుని తాకే సన్నివేశాలు, ఉత్కంఠరేపే ట్విస్ట్లతో ప్రేమలు సినిమా ఉద్వేగభరిత అనుభూతిని ఇస్తుంది.
మరి మీరూ ఈ వీకెండ్ ధమాకా డబుల్ వినోదాన్ని మిస్సవకుండా ఉండాలంటే మీ అభిమాన తారలు సందడి చేసిన ‘శ్రావణలక్ష్మి’ మెగా ఈవెంట్తోపాటు, హృదయాన్ని హత్తుకునే కథతో సాగే ప్రేమలు సినిమాని తప్పక చూడండి!
శ్రావణమాసం ప్రత్యేక సంబరం ‘శ్రావణలక్ష్మి’, అందమైన ప్రేమకథ ‘ప్రేమలు’. ఈ ఆదివారం, మీ జీ తెలుగులో.మిస్ కాకుండా చూసేయండి!
.