ఆదిత్య మ్యూజిక్ కు 'లగ్గం' ఆడియో రైట్స్ !!!

సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం( Laggam ).ఈ సినిమాకు రమేశ్ చెప్పాల( Ramesh Cheppala ) రచన -దర్శకత్వం వహిస్తున్నారు.

 Aditya Music Secures Audio Rights For laggam !!! ,laggam , Ramesh Cheppala , S-TeluguStop.com

పెళ్లిలో ఉండే సంబురాన్ని, విందుని, చిందుని, కన్నుల విందుగా చూపించబోతున్నారు.ఇది కల్చరర్ ఫ్యామిలీ డ్రామాప్రతి ఒక్కరు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు, కొత్త ఎక్స్పీరియన్స్ కళ్ళముందు ఉంచే ఈ చిత్రం కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుందని నటకిరిటి రాజేంద్రప్రసాద్ గారు తెలిపారు.

షూటింగ్ పూర్తి చేసుకొని శర వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న లగ్గం సినిమా పాటలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.ఈ సినిమాకి చరణ్ అర్జున్ సంగీతం అందించారు.

ప్రముఖ ఆడియో కంపెనీ అయిన ఆదిత్య మ్యూజిక్ సంస్థ లగ్గం ఆడియో రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకోవడం విశేషం.జూన్ 21న ఫస్ట్ లిరికల్ సాంగ్ ను ప్రముఖ దర్శకుడు చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు.

పెళ్లి నేపథ్యంలో సాగే ఈ లగ లాగ లగ్గం సాంగ్ అందరిని ఆలరించనుందని వేణు గోపాల్ రెడ్డి గారు అన్నారు.

ఈ చిత్రానికి కథ – మాటలు- స్క్రీన్ ప్లే- దర్శకత్వం రమేశ్ చెప్పాల, సంగీతం:చరణ్ అర్జున్.ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి, కెమెరామెన్: బాల్ రెడ్డి, ఆర్ట్:కృష్ణ సాహిత్యం: చరణ్ అర్జున్, సంజయ్ మహేశ్ వర్మ, కొరియోగ్రఫీ.అజయ్ శివశంకర్.

నటీనటులు:

సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, టి.సుగుణ ,లక్ష్మణ్ మీసాల, ప్రభావతి.కంచరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను, సత్య ఏలేశ్వరం, అంజిబాబు, రాదండి సదానందం, కిరీటి తదితరులు ప్రముఖ పాత్ర పోషించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube