హైదరాబాద్, 06 ఆగస్ట్ 2024: తెలుగు ప్రేక్షకులకు ఎనలేని వినోదాన్ని పంచడంలో ముందుండే ఛానల్ జీ తెలుగు( Zee Telugu) ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోతో పాటు ప్రత్యేక కార్యక్రమాలతో వినోదం అందించడంతోపాటు ప్రతిభావంతులను వెలికితీయడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.సరిగమప నిర్వహించిన 15 సీజన్లలో ఎంతోమంది గాయనీగాయకులను ప్రేక్షకులకు పరిచయం చేసింది.
విజయవంతంగా 15 సీజన్లు పూర్తి చూసుకున్న జీ తెలుగు ‘సరిగమప సీజన్ 16- ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్’ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఆడిషన్స్ నిర్వహిస్తోంది.
ప్రతిభావంతులైన గాయనీగాయకులు ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకునే అవకాశం అందిస్తోంది.జీ తెలుగు సరిగమప తదుపరి సీజన్ కోసం తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో ఆడిషన్స్ నిర్వహిస్తోంది.ప్రతిభను ప్రోత్సహిస్తూ మట్టిలోని మాణిక్యాలను వెలికితీసేందుకు ఈ శని, ఆదివారాల్లో మన వరంగల్,
కరీంనగర్( Karimnagar )లో ఆడిషన్స్ నిర్వహిస్తోంది.15-30 సంవత్సరాల వయస్సుగల గాయనీగాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు.సరిగమప సీజన్ 16 ఆడిషన్స్ ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయి.వరంగల్( Warangal)లో ఆగస్టు 10న ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజ్, నయీమ్ నగర్, హన్మకొండ, ఆగస్టు 11న కరీంనగర్‌లోని ఆల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్, కొత్తపల్లిలో ఆడిషన్స్ జరగనున్నాయి.
వివరాల కోసం 9154670067 నెంబర్‌పై సంప్రదించవచ్చు.ఆసక్తి గలవారు జీ తెలుగు అందిస్తున్న ఈ గోల్డెన్ ఛాన్స్‌ని మిస్ కావద్దు!అంతేకాదు ఔత్సాహికులు ఆగస్టు 30 వరకు డిజిటల్ ఆడిషన్స్ ద్వారా కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు.పాట పాడిన తమ వీడియోలను 9154670067 నెంబర్‌కి వాట్సాప్ లేదా [email protected] ఇమెయిల్ ద్వారా పంపవచ్చు.ఇంకెందుకు ఆలస్యం జీ తెలుగు ‘సరిగమప సీజన్ 16 – ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్’ టైటిల్ కోసం మీరూ పోటీలో పాల్గొనండి!మీలోని ప్రతిభను నిరూపించుకునేందుకు చక్కని వేదిక.జీ తెలుగు సరిగమప సీజన్ 16- ది నెక్ట్స్ సింగింగ్ యూత్ ఐకాన్.ఆడిషన్స్‌లో వెంటనే పాల్గొనండి!
.