బుల్లితెరపై ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించిన షోలలో జబర్దస్త్( Jabardasth ) ఒకటనే సంగతి తెలిసిందే.ఈ షోకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
ఒకప్పుడు రికార్డ్ స్థాయిలో రేటింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ షో ప్రస్తుతం భారీ స్థాయిలో రేటింగ్స్ ను సొంతం చేసుకోవడంలో ఫెయిలవుతున్న సంగతి తెలిసిందే.ఎంతమంది కమెడియన్లు ట్రై చేస్తున్నా ఈ షో ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించడం లేదు.
మరోవైపు జబర్దస్త్ కామెడీ షోకు ( Jabardast Comedy Show )పోటీగా మొదలైన కొత్త షోలు సైతం ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఫెయిల్ అయ్యాయనే సంగతి తెలిసిందే.అయితే త్వరలో ఈ కామెడీ షోకు ఎండ్ కార్డ్ పడనుందని తెలుస్తోంది.
పదేళ్లకు పైగా ప్రసారమైన ఈ షో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వీక్ డేస్ లో రాత్రి 9.30 గంటలకు ప్రసారమవుతూ ఉండటంతో ఆశించిన రేంజ్ లో రేటింగ్స్ రావడం లేదు.
ఈ రీజన్ వల్లే ఈ షోను ఆపేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.జబర్దస్త్ షో స్థానంలో మరో కొత్త షోను ప్రసారం చేస్తారా? లేక ఇతర కార్యక్రమాలను ప్రసారం చేస్తారా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.జబర్దస్త్ షో ఆగిపోనుందనే వార్త ఈ షో అభిమానులను ఎంతగానో బాధ పెడుతోందని సమాచారం అందుతోంది.
జబర్దస్త్ షో ఆపేస్తే కమెడియన్లకు ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంది.
ఎంతోమంది కమెడియన్లు వెలుగులోకి రావడానికి ఈ షో కారణమని చెప్పవచ్చు.ఈ షో వల్ల ఆర్థికంగా స్థిరపడిన కమెడియన్లు( Comedians ) ఎక్కువమంది ఉన్నారు.ఈ షో తమ జీవితాలను మార్చేసిందని చాలామంది కమెడియన్లు చెబుతారు.
ఈటీవీకి సైతం ఈ షో మంచి పేరును తెచ్చిపెట్టింది.ఈ షో నిర్మాతలకు సైతం ఈ షో వల్ల కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వచ్చాయని సమాచారం అందుతోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy