చిత్తూరు జిల్లా కుప్పంలో ఏనుగుల బీభత్సం

చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.రాగిమాను మిట్ట సమీపంలో ఐదు ఏనుగులు సంచరిస్తున్నాయి.

దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవవుతున్నారు.ఈ క్రమంలోనే పంటపొలాలను ధ్వంసం చేసిన ఐదు గజరాజుల గుంపు నూలకుంట ప్రాంతంలో ఓ రైతుపై దాడికి పాల్పడ్డాయి.

ఈ దాడిలో రైతు సిద్ధప్ప తీవ్రంగా గాయపడ్డాడు.వెంటనే గమనించిన స్థానికులు సిద్ధప్పను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు ఏనుగులను ఫారెస్ట్ ఏరియా వైపు మళ్లిస్తున్నారు.అలాగే సమీప ప్రాంత వాసులు పొలాల్లోకి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement
బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు