ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలి ....

రాజన్న సిరిసిల్ల జిల్లా :త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని చందుర్తి సీఐ కిరణ్ కుమార్( CI Kiran Kumar ) పిలుపునిచ్చారు.

శనివారం రుద్రంగి మండల కేంద్రంలో కేంద్రసాయుధ బలగాలతో కలిసి కవాతు నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి సంఘటనలు జరగకుండా మండలంలో కవాతు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఎలాంటి చర్యలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగే విధంగా ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సై రాజేష్ ( SI rajesh )తో పాటు కేంద్ర సాయుధబలగాల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు కావతు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement
చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?

Latest Rajanna Sircilla News