ఒంట్లో కొవ్వు పెర‌గ‌కుండా ఉండాలా..వీటిని డైట్‌లో చేరిస్తే స‌రి?

శ‌రీరంలో కొవ్వు పేరుకుపోవ‌డం వ‌ల్ల లావుగా మార‌డ‌మే కాదు.గుండె జ‌బ్బులు, మ‌ధుమేహం, ర‌క్త పోటు ఇలా ఎన్నో జ‌బ్బులు కూడా చుట్టు ముట్టేస్తుంటాయి.

అందుకే ఒంట్లో కొవ్వును క‌రిగించేందుకు నానా తిప్ప‌లు ప‌డుతుంటారు.ఈ క్ర‌మంలోనే కొంద‌రు తిన‌డం కూడా మానేస్తుంటారు.

కానీ, ఇలా చేయ‌డం చాలా పొర‌పాటు.వాస్త‌వానికి కొన్ని కొన్ని ఆహారాలే శ‌రీరంలో కొవ్వును పెర‌గ‌కుండా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి ఆ ఆహారాలు ఏంటీ అన్న‌ది లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ఒంట్లో పేరుకుపోయి ఉన్న కొవ్వును క‌రిగించ‌డంలోనూ, మ‌ళ్లీ కొవ్వును పెర‌గ‌కుండా చేయ‌డంలోనూ గోధుమ గడ్డి అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

Advertisement

అందువ‌ల్ల‌, త‌ర‌చూ గోధుమ గ‌డ్డి జ్యూస్ తీసుకుంటే మంచిది.అలాగే చేప‌లు కూడా కొవ్వును పెర‌గ‌కుండా చేయ‌గ‌ల‌వు.

వారంలో ఒక‌టి లేదా రెండు సార్లు చేప‌లు తీసుకుంటే అందులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కొవ్వు పెర‌గ‌కుండా చేస్తాయి.

రోజుకో యాపిల్ పండు తిన‌డం వ‌ల్ల కూడా ఒంట్లో కొవ్వు పెర‌గ‌కుండా ఉంటుంది.విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు యాపిల్‌లో ఉంటాయి.కాబ‌ట్టి, డైలీ డైట్‌లో యాపిల్‌ను చేరిస్తే ఒంట్లో కొవ్వు పెర‌గ‌కుండా ఉండ‌డంతో పాటు ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా పొందొచ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

ఇక చాలా మంది న‌ట్స్ తింటే కొవ్వు పెరుగుతుంద‌ని భావిస్తారు.కానీ, త‌గిన మోతాదులో న‌ట్స్ తీసుకుంటే శ‌రీరంలో కొవ్వు పెర‌గ‌కుండా ఉంటుంది.ముఖ్యంగా బాదం, వాల్ న‌ట్స్‌, జీడి ప‌ప్పు, పిస్తా ప‌ప్పు వంటివి తీసుకుంటే మేలు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

ఉసిరి కాయలు కూడా శ‌రీర కొవ్వుకు అడ్డుక‌ట్టు వేస్తాయి.అందువ‌ల్ల‌, ఉసిరి కాయ జ్యూస్ తీసుకోవ‌డం లేదా ఉసిరి కాయ‌ల‌ను ఎండ బెట్టి పొడి చేసుకుని వాడటం చేస్తే ఎంతో మంచిది.

Advertisement

తాజా వార్తలు