ఇ-సిగరెట్‌ను జేబులో పెట్టుకుంటున్నారా.. ఇక అంతే సంగతులు!

పొగాకు వాడితే ప్రమాదకరమని ప్రభుత్వం హెచ్చరికలు చేస్తోంది.సిగరెట్ ప్యాకెట్లపై ప్రాణాంతకం అనే ముద్రలను వేయిస్తోంది.

అయినప్పటికీ వాటిని ఎవరూ పట్టించుకోరు.తీరా ఊపిరితిత్తులు వంటి అంతర్గత అవయవాలకు ఏదైనా ప్రమాదం వాటిల్లితే అప్పుడు తెలివి తెచ్చుకుంటారు.

పొగాకులో ఉండే నికోటిన్ వల్ల క్యాన్సర్ సైతం వస్తుందని పలు అధ్యయనాలలో తేలినా చాలా మంది ఆ హెచ్చరికలను విస్మరిస్తున్నారు.ఇక ఇటీవల కాలంలో ఇ-సిగరెట్‌లను వాడడం ప్రజలు అలవాటు చేసుకుంటున్నారు.

ముఖ్యంగా యువకులు వీటి పట్ల ఆకర్షితులవుతున్నారు.ఇదే రీతిలో ఓ యువకుడు ఇ-సిగరెట్‌ను జేబులో పెట్టుకుని వెళ్లగా, అతడికి ఊహించని ప్రమాదం ఎదురైంది.

Advertisement
E Cigarette Bursts In A Mans Pocket Details, Ee Cegtate,pocket, Health, Tips, He

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.బ్లేయర్ టర్న్‌బుల్(26) అనే స్కాట్లాండ్ యువకుడు ఇ-సిగరెట్ (వేప్) వాడుతున్నాడు.

దానిపై మోజుతో దానిని అస్సలు వదిలి పెట్టలేదు.ఎక్కడకు వెళ్లినా తన వెంటే తీసుకెళ్లేవాడు.

అతడు ఆచిన్‌లెక్ షాప్ అర్బన్ హెయిర్‌లో పనిచేస్తాడు.ఇక ఆదివారం నాడు తన తండ్రితో కలిసి కిల్‌మార్నాక్‌లోని వీట్‌షీఫ్ ఇన్‌లో బయటికి వెళ్లాడు.

ఓ పబ్‌కు వెళ్లి తాగుతూ డ్యాన్స్ చేస్తుండగా ఊహించని ప్రమాదం ఎదురైంది.అతడి జేబులో ఉన్న ఇ-సిగరెట్ పేలిపోయింది.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
ఓరి దేవుడో.. జంతువులు మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. (వీడియో)

దీంతో అతడి కాలుకు పెద్ద గాయమైంది.

E Cigarette Bursts In A Mans Pocket Details, Ee Cegtate,pocket, Health, Tips, He
Advertisement

వెంటనే హాస్పిటల్‌కి తరలించగా గాయం తీవ్రతపై వైద్యులు సైతం ఆశ్చర్యపోయారు.కాలికి థర్డ్ డిగ్రీ గాయాలు కావడంతో బాగా లోతుగా శరీరం కాలిపోయింది.దీంతో తొడ కండరంలోని భాగాన్ని తీసుకుని కాలిన గాయం ఉన్న చోట వైద్యులు అతికించారు.

అయినప్పటికీ ఈ మచ్చ తనకు జీవితాంతం ఉంటుందని, ఆ గాయం తాలూకూ బాధను జీవితాంతం అనుభవించాలని బాధితుడు చెబుతున్నాడు.ప్రమాదం జరిగినప్పుడు చాలా భయపడ్డానని, తన ప్యాంట్ విప్పి పరుగులు పెట్టానని గుర్తు చేసుకున్నాడు.ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది.

దీంతో ఇ-సిగరెట్ తాగడం వల్లే కాకుండా జేబులో పెట్టుకున్నా ప్రమాదమేనని పలువురు నెటిజన్లు పేర్కొంటూ పోస్టులు పెడుతున్నారు.

తాజా వార్తలు