దసరా సూపర్ హిట్... డైరెక్టర్ కి బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్ గా ఇచ్చిన నిర్మాత!

నాచురల్ స్టార్ నాని(Nani) ప్రస్తుతం దసరా సినిమా(Dasara Movie) సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.

గత కొద్దిరోజులుగా సరైన సక్సెస్ లేకపోవడంతో ఎంతో ఇబ్బంది పడుతున్న నాని దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి అన్నిచోట్ల అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది.మార్చి 30 వ తేదీ విడుదలైన ఈ సినిమా 100 కోట్లకు చేరువకానుంది.

ఇలా ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో చిత్ర బృందం మొత్తం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమాకి నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Sreekanth Odela) దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ చిత్రాన్ని చెరుకూరి సుధాకర్(Cherukuri Sudhakar) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.ఇక ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో నిర్మాత మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది.

Advertisement

ఇలాంటి ఒక అద్భుతమైన సినిమాని ప్రేక్షకులకు అందించినందుకు డైరెక్టర్ కి ఈయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలపడమే కాకుండా ఏకంగా ఖరీదైన బీఎండబ్ల్యూ కారును(BMW Car) కూడా గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తుంది.ఇలాంటి అద్భుతమైన సినిమాని తెరకెక్కించినందుకు ఈయన ఏకంగా 80 లక్షల ఖరీదు చేసే కారును బహుమానంగా ఇచ్చారని సమాచారం.

ఇక డైరెక్టర్ కు కారును బహుమానంగా ఇచ్చిన నిర్మాత ఇతర టెక్నీషియన్లకు కూడా కానుకలు ఇచ్చారని తెలుస్తోంది.మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి శ్రీకాంత్ ఓదెలకి ఇప్పటికే పలు అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఈయన అఖిల్ అక్కినేని(Akhil Akkineni) హీరోగా ఓ సినిమా ఫిక్స్ అయ్యారని సమాచారం.

అయితే ఈ విషయం గురించి సరైన క్లారిటీ లేదని చెప్పాలి.ఏది ఏమైనా టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో టాలెంటెడ్ డైరెక్టర్ దొరికారని శ్రీకాంత్ దసరా సినిమా ద్వారా నిరూపించుకున్నారు.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు