సెన్సార్ పూర్తి చేసుకున్న 'కింగ్ ఆఫ్ కోత'.. దుల్కర్ కు మరో హిట్ అందుతుందా?

మలయాళ స్టార్ హీరోల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ ( Dulquer Salmaan ) ఒకరు.

ఇతడు పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అవ్వడంతో దుల్కర్ సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్నాయి.

ఎంతో కస్టపడి దుల్కర్ పాన్ ఇండియా వ్యాప్తంగా పేరు తెచ్చుకుని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.ఈ యంగ్ హీరో సినిమాలంటే అన్ని బాషల ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇతడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.ప్రజెంట్ దుల్కర్ సల్మాన్ నటించిన మూవీ రిలీజ్ కు సిద్ధం అయ్యింది.కింగ్ ఆఫ్ కోత ( King of Kotha ) అనే సినిమా ఆగస్టు 24న రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమా కోసం అంతటా బాగానే ప్రమోషన్స్ చేస్తున్నారు.ఇక తెలుగులో కూడా ఓపెనింగ్స్ బాగా రాబట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు.దీంతో ఇక్కడ కూడా డీసెంట్ బజ్ నెలకొంది.

Advertisement

గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు వర్షన్ లో సెన్సార్ పూర్తి చేసుకుంది.తెలుగులో ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు వారు అందించింది.

మొత్తానికి అన్ని పనులు పూర్తి చేసుకుంటూ రిలీజ్ కు రెడీ అయ్యింది.ఈ సినిమాను అభిలాష్ జోషి డైరెక్ట్ చేయగా రితికా సింగ్, ఐశ్వర్య లక్ష్మి ( Aishwarya Lekshmi ) హీరోయిన్ లుగా నటించారు.

జేక్స్ బిజోయ్ సంగీతం అందించఫ ఈ4 మూవీస్ అండ్ జీ స్టూడియోస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు.సీతారామం ( Sita Ramam )వంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోత సినిమాతో కూడా మంచి హిట్ అందుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నాడు.మరి ఈ యంగ్ హీరో ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు