NTR, Savitri : భీముడికేనా డ్యూయెట్ ఉండేది… దుర్యోధనుడికి ఉంటే తప్పా..?

కొన్నేళ్లు వెనక్కి వెళితే ఏదైనా ఒక సినిమా తీస్తే అప్పట్లో ఒక ఆడిటోరియం తీసుకొని అందులో కొంతమంది దర్శకులకు నిర్మాతలకు షో వేసి చూపించేవారు.

ఇప్పటికి ఆ ట్రెండు కొనసాగుతుంది కానీ దాన్ని ప్రివ్యూ అని చాలా గొప్పగా చెబుతున్నారు.

అప్పట్లో అలా ఉండేది కాదు కేవలం అభిప్రాయాలు తెలుసుకోవడానికి మాత్రమే అలా షో వేసి చూపించేవారు.సినిమా చుసిన వారు వారికి తోచిన అభిప్రాయం చెపితే అందులో పాటించదగినవన్నీ కూడా పాటించి మళ్లీ మార్పులు చేర్పులు చేసి సినిమాను విడుదలకు పంపించే వారు.

అలా దాదాపు 50, 60 ఏళ్ల క్రితం ఒక విచిత్రమైన సంఘటన జరిగింది.భీముడికి మాత్రమే డ్యూయెట్ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి ? దుర్యోధనుడికి కూడా పెడితే బాగుంటుంది కదా ఇదే అసలు విషయం.

పాండవ వనవాసం( Pandava vanavasam ) అనే సినిమా 1965 లో ఎన్టీఆర్, సావిత్రి, ఎస్వీఆర్ ( NTR, Savitri, SVR ) వంటి మహా మహా నటులతో నిర్మించబడి ప్రేక్షకుల ముందుకు వచ్చి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమా రావడానికి ముందే పాతాళ భైరవి, మాయా బజార్ వంటి ఎన్నో మంచి సినిమాలు విడుదలై తెలుగు సినిమా రంగానికి ఒక దర్శక పితామహుడు అయినటువంటి కేవీ రెడ్డి ( KV Reddy )గారిని అందించాయి.ఆ కేవీ రెడ్డి గారిని పిలిపించే పాండవ వనవాసం సినిమా చూపించారట సదరు దర్శకనిర్మాతలు.

Advertisement

సినిమా మొత్తం చూశాక చాలా చక్కగా తీశారు కానీ సావిత్రికి ఎన్టీఆర్ కి ఒక పాట పెడితే బాగుంటుంది కదా ఎందుకు పెట్టలేదు అంటూ దర్శకుని ప్రశ్నించాడట కెవి రెడ్డి.ఈ సినిమాలో ఎన్టీఆర్ భీముడు సావిత్రి ద్రౌపతి కాబట్టి డ్యూయెట్ ఉంటే ఎలా ఉంటుంది అండి అందుకే పెట్టలేదు అని సదరు దర్శకుడు సమాధానం ఇచ్చాడట.

ద్రౌపతికి భీముడికి డ్యూయెట్ పెట్టమని ఎవరు చెప్పారు మీరు సావిత్రికి ఎన్టీఆర్ కదా పెట్టాల్సింది అని ఆయన బదులు చెప్పారట.ఆ తర్వాత విషయాన్ని అర్థం చేసుకొని హిమగిరి సొగసులు అనే ఒక పాట తయారు చేయించి సినిమాలో జొప్పించి విడుదల చేశారట.ఆ పాట ఇప్పటికి ఒక ఆల్ టైం క్లాసిక్ గా నిలిచిపోయింది.

అయితే ఇదే విషయాన్నీ సాకుగా చేసుకొని ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమా తీసిన టైం లో అప్పటి ఈ సంఘటనను గుర్తుపెట్టుకుని కేవలం భీముడికికేనా దుర్యోధనుడికి కూడా ఉండాలి అని ఎన్టీఆర్ దుర్యోధనుడు పాత్ర చేస్తూ డ్యూయెట్ పెట్టుకున్నారట.ఇప్పటికి అర్థమైందా భీముడికి దుర్యోధనుడికి పాట కాదు ఎన్టీఆర్ కి మాత్రమే డ్యూయెట్ ఇది.అయన ఉంటె డ్యూయెట్ లేకుంటే ఎలా మరి.

మహేష్ బాబు సినిమాను తక్కువ అంచనా వేసిన స్టార్ ప్రొడ్యూసర్...
Advertisement

తాజా వార్తలు