డీఎస్సీ నీ 3 నెలలు వాయిదా వేసి మెగా డీఎస్సీ ప్రకటించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా: డీఎస్సీ లో పోస్టులు పెంచి మెగా డిఎస్సీ ప్రకటించాలనీ,మరో మూడు నెలలు వాయిదా వేయాలనీ గత కొంత కాలంగా డీఎస్సీ అభ్యర్థులు ప్రభుత్వానికి విన్నవిస్తున పట్టించుకోకుండా డీఎస్సీ పరీక్ష తేదీలను యధావిధిగా జరుతాయని ప్రకటించడం,ఇది పూర్తిగా నిరుద్యోగుల పై కక్ష సాధింపు చర్యగానే భావించాల్సి ఉంటుందని భీమ్ ఆర్మీ జిల్లా అద్యక్షులు దొబ్బల ప్రవీణ్ కుమార్ అన్నారు.

తెలంగాణ ఏర్పాటు ఉద్యమం నీరు, నిధులు, నియామకాలు మీద జరిగిందని, రాష్ట్రం ఏర్పడితే ఉద్యాగాలు వస్తాయనీ ఎందరో నిరుద్యోగ యువకులు ప్రాణాలు అర్పించారనీ,అలా 1200 మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడింది అని అన్నారు.

గత ప్రభుత్వంలో ఈ నియామకాల పక్రియ సరిగా జరగలేదని నిరుద్యోగ యువత అంత గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయడం వల్లనే, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారం లోకి వచ్చి సిఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు అని అన్నారు.ఇప్పుడు గతంలో జరిగిన విధంగానే ఈ ప్రభుత్వం వ్యవహరించడం సరియైన నిర్ణయం కాదని అన్నారు.

గత కొన్ని రోజుల క్రితమే టెట్ నిర్వహించి అందులో క్యాలిపై అయిన వారికి ప్రిపేర్ అవ్వడానికి కానీ సమయం ఇవ్వకుండా ఇంత తొందరగా పరీక్ష నిర్వహించడం వలన కొత్తగా టెట్ క్వాలిపై అయిన వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని,ఎన్ని రోజుల నుండి వేచి చూస్తూన వీరికి కూడా ప్రిపరేషన్ మరో రెండు నెలలు అవకాశం ఇచ్చి డీఎస్సీ అభ్యర్థుల అందరికీ న్యాయం చేయాలని కోరారు.ప్రభుత్వ డీఎస్సీ నీ యదవిధిగా నిర్వహిస్తాం అంటే మాత్రం రేపటి రోజు నుండి పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం అవుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమం లో భీమ్ ఆర్మీ నాయకులు నవీన్,విశాల్, శేఖర్,రాజు,ప్రదీప్, దినేష్,ప్రశాంత్ తదితరులు పాల్గోన్నారు.

Advertisement
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Latest Rajanna Sircilla News