రాజధాని అమరావతి పర్యటనకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్యెల్యేలు పెద్ద ఎత్తున హాజరైన సంగతి తెలిసిందే.ఈ పర్యటనపై ఏపీలో పెద్ద ఎత్తునే రాజకీయ దుమారం రేగింది.
ఈ ప్రాంత రైతులు, ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు.అందులో ఒకటి బాబు అనుకూల వర్గం కాగా మరొకటి వ్యతిరేక వర్గం.
బాబు పర్యటన సాగుతున్న సమయంలో గో బ్యాక్ చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.దీంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడం, మరికొందరు అత్యుత్సాహం చూపిస్తూ చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులు విసరడంతో రాజకీయ రచ్చ చెలరేగింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనపై తూళ్లూరు డీఎస్పీకి వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.చంద్రబాబు పర్యటనలో డ్రోన్లు కెమారాలు వినియోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తుళ్లూరు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు.
వైసీపీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి.సీఎం, మంత్రుల భద్రతకు ముప్పు వాటిల్లేలా డ్రోన్లు ఆ ప్రదేశంలో వాడారని ఫిర్యాదు చేశారు.
అదీకాకుండా సచివాలయం, అసెంబ్లీ పరిసరాల్లో అనుమతి లేకుండా డ్రోన్లు ఏ విధంగా వినియోగించారు అనే విషయం మీద దర్యాప్తు చేయాలని కోరారు.