పుట్టిన గడ్డ పై ఎనలేని మమకారం. 300 మందికి వైద్య పరీక్షలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: పుట్టిన గడ్డ పై ఎనలేని మమకారం ఆయనది.

తాను చిన్నప్పుడు పుట్టి పెరిగిన ఊరిలో అందరితో చిన్నప్పుడు పంట కాలువల వద్ద ఆదుకున్న తీపి గుర్తులు,ఊరు కచిరు కాడ చిన్నప్పుడు ఆడుకున్న గుర్తులు ఇంకా మదిలో నుండి తొలగిపోలేదు.

అక్కడే ఓనమాలు నేర్చుకున్న చేతులు నేడు పేద ప్రజలకు వైద్యం అందిస్తూ అందరి ప్రాణాలు కాపాడుతున్నారు.డాక్టర్ జి.సత్యనారాయణ స్వామి. గ్రామ ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించాలని సదుద్దేశంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అదేవిధంగా ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్ భాగస్వామ్యంతో పదిర గ్రామ సర్పంచ్ వజ్రమ్మ, మాజీ సెస్ డైరెక్టర్ కుంభాల మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు .సుమారు 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వజ్రమ్మ మాట్లాడుతూ అన్ని రుగ్మతలకు సంబంధించిన ఈ ఎన్ టి, న్యూరో, గైనకాలజిస్ట్, ఆర్తో, ఎండి, ఎం ఎస్ డాక్టర్లు పాల్గొని వైద్య సేవలు అందించారన్నారు.

అదేవిధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి తమ గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ ప్రజల కొరకు నిర్వహించాలని డాక్టర్ జి సత్యనారాయణ స్వామిని కోరారు.వెంటనే స్పందించిన డాక్టర్ సత్యనారాయణ స్వామి పదిర గ్రామాన్ని వైద్యపరంగా దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు.తమ గ్రామాన్ని దత్తత తీసుకోవడం పట్ల సర్పంచ్ వజ్రమ్మ, మాజీ సెస్ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, గ్రామస్తులు,హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం అశ్విని హాస్పిటల్ డాక్టర్ జి సత్యనారాయణ స్వామి, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ పెంచలయ్య, వైద్య బృందానికి శాలువాతో సత్కరించి సన్మానం చేశారు.

Advertisement
చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?

Latest Rajanna Sircilla News