డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం - ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా: డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహనీయుడు,స్వతంత్ర సమరయోధుడు, గొప్ప సంఘసంస్కర్త వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి భారత పార్లమెంటులో 40 సంవత్సరాల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా, ఉప ప్రధానిగా కూడా పనిచేశారు.

బయోగ్రఫీ పట్టుదల నిండిన ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ తన రాజకీయ జీవితాన్ని ఆదర్శప్రాయంగా కొనసాగించారు.

Dr Babu Jagjivan Ram Services Are Memorable Sp Akhil Mahajan Details, Dr Babu Ja
Dr Babu Jagjivan Ram Services Are Memorable SP Akhil Mahajan Details, Dr Babu Ja

విద్యావేత్తగా మచ్చలేని నిస్వార్ధ నాయకునిగా కరువు కోరల్లో చిక్కిన భారతావని వ్యవసాయ మంత్రిగా హరిత విప్లవాన్ని సహకారం చేసి భారత ఆహార గిడ్డంగులను ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారు.కయ్యానికి కాలుదువ్విన బ్రిటిష్ శత్రువులను మట్టి కరిపించి భారతదేశానికి విజయాన్ని సాధించిన భారత సేనకు మంత్రిగా ధీరోదాత్తతను ప్రదర్శించి, యావత్ భారత ప్రజానీకం గుండెల్లో నేటికీ సజీవంగా ఉన్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!
Advertisement

Latest Rajanna Sircilla News