చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఇంటింటా ప్రచారం ...

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లిలో 5, 6 వార్డులలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేలు వివేకానంద, ఆనంద్ తో కలిసి ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు.

అధికార టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం ఆరో వార్డునకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకుడు సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది అధికార పార్టీలో చేరారు.పద్మశాలి రాష్ట్ర నాయకుడు కుంద్యాల శ్రీనివాస్, స్థానిక మున్సిపల్ చైర్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...

తాజా వార్తలు