కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం - 6 గ్యారెంటీ కార్డులను అందజేశారు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం ఇంటింటికి 6 పథకాల గ్యారెంటీ కార్డులను మండల కాంగ్రెస్ కమిటీ పంపిణీ చేసింది .

ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ మహిళల నుండి అనూహ్యమైన స్పందన వస్తుందని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని హామీ ఇవ్వడం జరుగుతుందన్నారు.

మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక పథకాలు తేవడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.రైతులకు ఏడాదికి 15వేలు వడ్లకు గిట్టుబాటు ధరగా క్వింటాలుకు 2600 ఇస్తాను అనడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

వితంతు ఒంటరి వృద్ధాప్య పెన్షన్లను 4000 ఇస్తామని గ్యారెంటీ కార్డులో ప్రకటించడం పట్ల పెన్షనర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.పోతిరెడ్డి పల్లెలో మండల ప్రధాన కార్యదర్శి సిరిపురం మహేందర్ ఆధ్వర్యంలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ హామీ పత్రాలను ఇవ్వడం జరిగిందని తెలిపారు .ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, మండల ఉపాధ్యక్షుడు గంట బుచ్చ గౌడ్ , కార్యదర్శి కోనేటి పోచయ్య, పట్టణ అధ్యక్షుడు చెన్ని బాబు, నాయకులు తిరుపతి గౌడ్, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, మానుక నాగరాజు, బిపేట రాజు ,సంతోష్ గౌడ్, గుర్రం రాములు, తిరుపతి రెడ్డి ,మామిండ్ల కిషన్ తదితరులు పాల్గొన్నారు.

డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించండి
Advertisement

Latest Rajanna Sircilla News