నవగ్రహాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్న శునకం..

రాజన్న సిరిసిల్ల జిల్లా:రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో అద్భుత ఘట్టం చోటుచేసుకుంది.

గురువారం శని జయంతి సందర్భంగా గ్రామంలోని గీత మందిరంలో ఉన్న నవ గ్రహాల వద్ద ఓ శుకనం 11 ప్రదక్షిణలు చేయడం అందరిని ఆశ్చర్య పరిచింది.

మాములుగా అయితే శని జయంతి సందర్భంగా భక్తులు ఆలయంలోని నవ గ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం మాములే కానీ ఒక శునకం ఇలా నవ గ్రహాల చుట్టూ తిరగడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తుంది.ఇది కాస్త అక్కడున్న వారు వీడియో తీసి పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది.

కొండాపూర్ లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

Latest Rajanna Sircilla News