కమలహాసన్ కి భారతీయుడు 2 సినిమా మీద నమ్మకం లేదా..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు కమలహాసన్.

( Kamal Haasan ) ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ పొందడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు.

ఇక విక్రమ్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన వరుసగా సినిమాలను లైన్ లో పెడుతూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న భారతీయుడు 2( Bharateeyudu 2 ) సినిమా జులై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను చేపట్టడంలో శంకర్,( Shankar ) కమలహాసన్ ఇద్దరు కూడా చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక రీసెంట్ గానే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఏర్పాటు చేశారు.అయితే కమల్ హాసన్ మాత్రం ఈ సినిమా మీద అంత కాన్ఫిడెంట్ గా లేనట్టుగా తెలుస్తుంది.

అందుకే ఆయన ఈ సినిమా ప్రమోషన్స్ కి వచ్చిన ప్రతిసారి పెద్దగా మాట్లాడకుండా చాలా వరకు తక్కువ మాట్లాడుతూ వస్తున్నారు మరి ఎందుకు ఆయన ఇలాంటి వైఖరిని కనబరుస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది.ఇక ఇదిలా ఉంటే కమలహాసన్ ప్రభాస్( Prabhas ) హీరోగా వస్తున్న కల్కి సినిమాలో( Kalki Movie ) విలన్ పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

Advertisement

ఈ సినిమా ద్వారా తనకు తాను పాన్ ఇండియాలో భారీ గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా ఈ సినిమాతో వచ్చిన హైప్ తోనే తను భారతీయుడు 2 సినిమాని రిలీజ్ చేయాలని చూస్తున్నాడు.ఇక అందుకే ఈ సినిమాని జూలై 12 వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.ఇక కల్కి సినిమాను ఈనెల 27వ తేదీన చేస్తున్నారు.

అయితే భారతీయుడు 2 సినిమా మాత్రం జూలై 12న రిలీజ్ అవుతుంది.అంటే ఈ రెండు సినిమాల మధ్య దాదాపు 15 రోజుల మాత్రమే గ్యాప్ ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు