ఏందీ డాక్టర్ బాబు ఇది : పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని...

ఈ మధ్యకాలంలో కొందరు డబ్బు, కామం వంటివాటి మోజులో పడి చివరికి కట్టుకున్న వారిని సైతం మోసం చేయడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు.

కాగా ఓ వివాహిత ఓ డాక్టర్ చెప్పిన మాయ మాటలు నమ్మి ఏకంగా కట్టుకున్న భర్తని మరియు కుటుంబ సభ్యులను విడిచి పెట్టి వెళ్లి డాక్టర్ తో వివాహేతర సంబంధం పెట్టుకొని చివరికి డాక్టర్ తన మోజు తీర్చుకొని వదిలేశాడని పోలీసులను ఆశ్రయించిన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని బాస్తీ పరిసర ప్రాంతంలో ఓ యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.అయితే ఇటీవలే యువతి కి తన దూరపు చుట్టం పైన ఓ వ్యక్తితో వివాహం జరిగింది అయితే తన భర్త మార్కెటింగ్ సంస్థలో పని చేస్తుండడంతో ఇంటి నుంచి ఉదయం బయటికి వెళ్లి రాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చేవాడు.

దీంతో యువతి కొంతమేర బోర్ గా ఫీల్ అయ్యేది.కాగా ఈ క్రమంలో టైం పాస్ కోసం సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించేది.

ఈ క్రమంలో ఫేస్ బుక్ ఖాతాలో జేడీ యాదవ్ అనే ప్రభుత్వ ఉద్యోగి తో పరిచయం ఏర్పడింది అయితే తొందరలోనే ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది.దీంతో జేడీ యాదవ్ కూడా తన ప్రియురాలిని బుట్టలో వేసుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని అలాగే ఇతర మాయ మాటలు చెప్పి వివాహిత తనవెంట తిప్పుకుఉన్నాడు.

Advertisement

దీంతో తన ప్రియుడు మాటలు విన్న వివాహిత తన కుటుంబ సభ్యులను సైతం విడిచిపెట్టి తన ప్రియుడితో వెళ్ళి పోయింది.ఈ క్రమంలో ఒక బాబు కి జన్మనిచ్చింది.

అయితే తన మోజు తీరిపోయిన తర్వాత డాక్టర్ బాబు యువతిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు.దీంతో పాటు తరచూ చిత్రహింసలకు గురి చేసేవాడు.

దాంతో ఆ యువతి తన కొడుకును వెంటబెట్టుకొని పోలీసులను ఆశ్రయించింది.అంతేకాకుండా రోజూ డాక్టర్ బాబు ఇంటి ముందు కూరగాయలమ్మి తన నిరసనను తెలియజేస్తోంది.

అలాగే తన ప్రియుడు మాటలు నమ్మి మోసపోయానని దీంతో ప్రస్తుతం తన ఇంటికి కూడా తిరిగి వెళ్లలేని పరిస్థితిలో ఉన్నానని కాబట్టి తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతోంది బాధితురాలు.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు