ఉప్పును నేరుగా చేతికి ఇవ్వొద్దని ఎందుకంటారో తెలుసా.. దీని వెనుక ఉన్న అసలు నిజం ఇదే..!

మన దేశంలో చాలామంది ప్రజలు చాలా రకాల మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటారు.ముఖ్యంగా హిందువులకు ఎన్నో రకాల నమ్మకాలు ఉంటాయి.

అలాంటి నమ్మకాలలో ఒకటి.ఉప్పును( salt ) చేతికి ఇవ్వొద్దని చెబుతూ ఉంటారు.

సాధారణంగా ఉప్పు డబ్బాను ఎదుటి వ్యక్తి ఇచ్చే సమయంలో నేరుగా చేతికి ఇవ్వకూడదని చెబుతూ ఉంటారు.అసలు ఉప్పును నేరుగా ఎందుకు ఇవ్వకూడదు, దీని గురించి హిందూ ధర్మం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Do You Know Why Salt Should Not Be Given Directly To Hand The Real Truth Behind

దశ దానాల్లో ఉప్పు ఒకటిని ప్రజలు నమ్ముతారు.పిత్రు దానాలలో( Pitru Danas ),శని దానాలలో ఉప్పును దానం చేస్తే ఉంటారు.అందుకే పూజ సమయంలో ఉప్పును దూరంగా ఉంచుతారు.

Advertisement
Do You Know Why Salt Should Not Be Given Directly To Hand The Real Truth Behind

ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా ప్రజలు నమ్ముతారు.ఉప్పందించడం అంటే ఒకరి రహస్యాన్ని మరొకరికి చెప్పడమే అని అర్థం వస్తుంది.

అందుకే ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని, ఉప్పు చేతిలోకి అందుకునే వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రజలు నమ్ముతారు.

Do You Know Why Salt Should Not Be Given Directly To Hand The Real Truth Behind

ఇంకా చెప్పాలంటే పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మధనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది.అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెబుతున్నారు.అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు.

ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో పరిహారం పరిహారాలు చేయాలని పండితులు సూచిస్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే జ్యేష్టా దేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేస్తారు కాబట్టి ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా అందుకుంటే వారి చెడు మీకు సక్రమిస్తుందని ప్రజలు నమ్ముతారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు