మీకు తెలుసా : కీ బోర్డులో అక్షరాలు ఆర్డర్‌లో ఎందుకు ఉండవు, ఆర్డర్‌లో ఉంటే ఏమవుతుంది?

పెరిగిన టెక్నాలజీతో ప్రపంచం మొత్తం అరచేతిలో ఇమిడి పోయే పరిస్థితి వచ్చింది.ఎక్కడ ఏం జరుగుతున్నది కంప్యూటర్‌లో లేదా స్మార్ట్‌ ఫోన్‌లో తెలుసుకునే అవకాశం ఉంది.

కంప్యూటర్‌ రంగంలో అద్బుతాలు ఆవిష్కారం అయ్యాయి.ముఖ్యంగా గత పాతిక సంవత్సరాల్లో కంప్యూటర్‌ రంగం వెయ్యి రెట్టు మెరుగు పడి అద్బుతమైన ఫలితాలను అందుకుంది.

కంప్యూటర్‌ ప్రారంభం అయిన సమయంలో ఇప్పుడున్న కంప్యూటర్‌కు పూర్తి విరుద్దంగా ఉంది.ఇక ప్రసుత్తం మనం రెగ్యులర్‌గా మొబైల్‌ లేదా కంప్యూటర్‌ లేదా ల్యాప్‌ టాప్‌కు వాడే కీ బోర్డులో అక్షరాలు క్రమంలో ఉండకుండా ర్యాండమ్‌గా ఉంటాయి.

కీబోర్డులోని అక్షరాలు ర్యాండమ్‌గా ఉండటంకు కారణం ఏంటో చాలా మందికి తెలియదు.అక్షరాలను క్రమంలో ఎందుకు అమర్చలేదు అనేది కొందరి అనుమానం ఉంటుంది.

Advertisement

కంప్యూటర్‌ లేదా స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించే ప్రతి ఒక్కరికి కీ బోర్డులో ఎందుకు అక్షరాలు క్రమంలో ఉండవు, ఎందుకు గందరగోళంగా పెట్టి ఉంటారు అంటూ అనుమానం వచ్చి ఉంటుంది.ఆ అనుమానంకు ఇప్పుడు నేను సమాధానం చెప్పబోతున్నాను.

అక్షర, పద దోషాలు లేకుండా ఉండే ఉద్దేశ్యంతో అక్షరాలను ఆర్డర్‌లో కాకుండా డిస్‌ ఆర్డర్‌లో పెట్టడం జరిగింది.కీ బోర్డు వచ్చిన మొదట్లో అక్షరాలు క్రమంలోనే ఉండేవి.

కంప్యూటర్‌ రాకముందు టైప్‌ రైటర్‌ కోసం అక్షరాలను ఆర్డర్‌లో పెట్టి కీ బోర్డును తయారు చేయడం జరిగింది.అయితే టైప్‌ చేస్తున్న సమయంలో చాలా దోషాలు మళ్లీ మళ్లీ వస్తున్నాయి.ఎంతో ఆలోచన చేసిన క్రిప్టోఫర్‌ లతం షోల్స్‌ చివరకు ఈ క్వెర్టీ కీబోర్డును తయారు చేయడం జరిగింది.

ఈ కీబోర్డులో ఏ అక్షరాలను అయితే ఎక్కువగా వాడుతున్నారో ఆ అక్షరాలను వేలికి దగ్గరగా ఉండేలా, తక్కువ శాతం వాడే అక్షరాలను పై భాగంలో ఇంకా తక్కువగా వాడే అక్షరాలను కింది భాగంలో అమర్చడం జరిగింది.ఇలా తయారు చేసిన తర్వాత టైప్‌ చేస్తే పద దోషాలు తగ్గాయి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

దాంతో ఇదే ప్రపంచ వ్యాప్తంగా శాస్వత కీబోర్డుగా మారిపోయింది.

Advertisement

తాజా వార్తలు