రోజు ఉదయం 10 నానబెట్టిన వేరు శనగలు అంటే ఏం జరుగుతుందో తెలుసా?

వేరుశనగలు( Peanuts ).వీటి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు.

వేరుశనగలు దాదాపు ప్రతి ఒక్కరి వంటింట్లోనూ ఉంటాయి.

వేరుశనగలతో ప్రతినిత్యం చట్నీలు తయారు చేస్తుంటారు.

అలాగే తాలింపుల్లో వాడుతుంటారు.వేరుశనగలతో తయారు చేసే చిక్కీలు చాలా మందికి మోస్ట్ ఫేవరెట్.

అయితే వేరుశనగలను నానబెట్టి తినడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.ముఖ్యంగా రోజు ఉదయం 10 నానబెట్టిన వేరుశనగలు తింటే మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి.

Advertisement

నానబెట్టిన వేరుశనగలు జ్ఞాపక శక్తిని పెంచుతాయి.నానబెట్టిన వేరుశనగలో నియాసిన్, విటమిన్ బి3 ( Niacin, Vitamin B3 )మ‌రియు ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు ఉండటం వల్ల మీ మెదడు మెరుగ్గా పని చేస్తుంది.

అభిజ్ఞా పనితీరును మెరుగుప‌డుతుంది.అలాగే నానబెట్టిన వేరుశనగల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

ఇవి ఫ్రీ రాడికల్స్‌తో( free radicals ) పోరాడటానికి మరియు శరీరంలోని క్యాన్సర్ కణాల వ్యాప్తిని ఆపడానికి ఉత్త‌మంగా సహాయపడతాయి.

నాన‌బెట్టిన వేరుశనగ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది.అదే స‌మ‌యంలో జీవక్రియను వేగవంతం చేస్తుంది.ఈ రెండూ రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

నిత్యం ప‌ది నాన‌బెట్టిన వేరుశన‌గలు తిన‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యంగా మారుతుంది.గుండెపోటు ( heart attack )యొక్క దీర్ఘకాలిక ప్రమాదం త‌గ్గుతుంది.

Advertisement

అలాగే నాన‌బెట్టిన వేరుశగ‌లు వెయిట్ లాస్ ను ప్ర‌పోట్ చేస్తాయి.వేరుశనగలు ప్రోటీన్, కొవ్వు ( Protein , fat )మరియు ఫైబర్ యొక్క మంచి మూలం.

ఉద‌యం నాన‌బెట్టిన వేరుశ‌గ‌లు తింటే త‌క్ష‌ణ శ‌క్తి ల‌భిస్తుంది.మీ జీవక్రియ పెరుగుతుంది.ఎక్కువ స‌మ‌యం పాటు ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది.

దాంతో తిన‌డం త‌గ్గిస్తారు.ఫ‌లితంగా బ‌రువు త‌గ్గుతారు.

నాన‌బెట్టిన వేరుశ‌న‌గ‌ల్లో ఐరన్, ఫోలేట్, జింక్ మరియు కాల్షియం వంటి పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి.అందువ‌ల్ల వీటిని రెగ్యుల‌ర్ గా త‌గిన మోతాదులో తింటే ర‌క్త‌హీన‌త బారిన ప‌డ‌కుండా ఉంటారు.

ఎముక‌లు దృఢంగా మార‌తాయి.హెయిర్ ఫాల్ త‌గ్గు ముఖం ప‌డుతుంది.

స్కిన్ ఏజింగ్ ఆల‌స్యం అవుతుంది.అంతేకాదు నాన‌బెట్టిన వేరుశనగల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నందున.

మ‌ధుమేహం వ‌చ్చే రిస్క్ కూడా త‌గ్గుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు