జాతీయ రాజకీయాలపై చంద్రబాబు ఆసక్తి .. అందుకే ఆ రాష్ట్రంపై ఫోకస్ ?

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) ఆసక్తి చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది.ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం తో జాతీయ రాజకీయాల పైన చంద్రబాబు ఫోకస్ చేస్తున్నారు.

 Chandrababu's Interest In National Politics Is Why The Focus Is On That State, T-TeluguStop.com

ముఖ్యంగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసి,  వచ్చే ఎన్నికల నాటికి వీలైనన్ని ఎక్కువ సీట్లు తెలంగాణలో సాధిస్తే తమకు తిరుగు ఉండదని,  జాతీయ రాజకీయాల్లో కీలకమవుతామని చంద్రబాబు భావిస్తున్నారు.అందుకే తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో టిడిపి ( TDP )కీలక పాత్ర పోషిస్తున్నా.  అత్యధిక ఎంపీలు ఉన్న రాష్ట్రాలకు దక్కిన ప్రాధాన్యం ఏపీకి పెద్దగా దక్కకపోవడం ,ఇప్పటికే నిధుల కేటాయింపులో బీహార్, యూపీ , మధ్యప్రదేశ్,  రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు ఇస్తున్న ప్రాధాన్యత ఏపీకి ఇవ్వకపోవడం, రాష్ట్రానికి గ్రాండ్ల రూపంలో సాయం అందించడానికి బదులుగా అప్పులు తీసుకునేందుకు అనుమతి మాత్రమే ఇస్తుండడం వంటివి చంద్రబాబుకు అసంతృప్తిని కలిగిస్తూనే ఉన్నాయి.

Telugu Ap, Janasena, Nda Alliance, Telangana Tdp, Ysrcp-Politics

భవిష్యత్తులో మరింత ఎక్కువ మంది ఎంపీలు ఉంటే కేంద్రంలో తమకు అంతగా పలుకుబడి ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు.అందుకే తెలంగాణలో టిడిపి బలం పుంజుకుని అక్కడ ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుచుకుంటే ఏపీ తెలంగాణ( AP Telangana ) లోని టిడిపి ఎంపీలు కేంద్రంలో కీలకం అవుతామని , కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా తమ మద్దతు అవసరం అవుతుందని , అదే జరగాలంటే తెలంగాణలో పూర్తిస్థాయిలో పార్టీని ప్రక్షాళన చేసి క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాల్సిన అవసరాన్ని చంద్రబాబు గుర్తించారు.

Telugu Ap, Janasena, Nda Alliance, Telangana Tdp, Ysrcp-Politics

2028 నాటికి తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.తెలంగాణలో బీఆర్ఎస్ ( BRS )ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేకపోవడం,  బీజేపీ పై విమర్శలు చేసే అవకాశం లేకపోవడం,  కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకున్నా ఇప్పుడు కలిగే ప్రయోజనం అంతంత మాత్రమే అనే అంచనాకు వచ్చినా, చంద్రబాబు పార్టీని బలోపేతం చేసే విషయంపైనే దృష్టి పెడితే భవిష్యత్తులో తమకు తిరుగు ఉండదని చంద్రబాబు భావిస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube