కళాతపస్వి విశ్వనాథ్ సంపాదించిన ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

కళాతపస్వి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కే విశ్వనాథ్ గారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గురువారం రాత్రి 11 గంటల సమయంలో మరణించిన విషయం తెలిసిందే.

ఇలా ఈయన మరణ వార్త చిత్ర పరిశ్రమను ఒక్కసారిగా కృంగదీసింది.

ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసిన లెజెండరీ డైరెక్టర్ విశ్వనాథ్ గారు మరణించడంతో పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు తరలివచ్చి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.మరి కాసేపట్లో విశ్వనాధ్ గారి అంత్యక్రియలు ముగియనున్నాయి.

ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు 50 సినిమాలకు దర్శకత్వం వహించగా ఈ సినిమాలన్నీ కూడా ఎంతో అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.ఇలా నటుడిగా దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న

విశ్వనాధ్ గారు మరణించడంతో ఈయన ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంత మొత్తంలో ఆస్తులు సంపాదించారనే విషయం గురించి నెటిజన్స్ ఆరా తీస్తున్నారు.అయితే ఇండస్ట్రీ సమాచారం ప్రకారం విశ్వనాథ్ గారు ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీగానే ఆస్తులను కూడా పెట్టారని, అయితే ఇది తన ముగ్గురు వారసులకు సమానంగా పంచి ఇచ్చారని తెలుస్తుంది.

Advertisement

విశ్వనాథ్ గారికి జూబ్లీహిల్స్ లో సుమారు 12 కోట్ల విలువచేసే ఇంటితోపాటు హైదరాబాద్ శివారులో దాదాపు 8 ఎకరాల పొలం ఉన్నట్టు తెలుస్తుంది.ఇలా ఈయనకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కావడంతో తాను సంపాదించిన ఆస్తులు మొత్తం తన ముగ్గురు వారసులకు సమానంగా రావాలన్న ఉద్దేశంతో ఈయన 130 కోట్ల రూపాయల ఆస్తిని మొత్తం తన ముగ్గురు వారసుల పేరిట సమానంగా రాసి ఇచ్చారని తెలుస్తోంది.తాను మరణించిన తర్వాత ఆస్తి విషయంలో తన వారసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తగా విశ్వనాధ్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు